Home రాజకీయాలు బాలకృష్ణను భరించలేక చేతులెత్తేసిన తేజ…

బాలకృష్ణను భరించలేక చేతులెత్తేసిన తేజ…

SHARE

ఎన్టీఆర్‌ బయోపిక్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా దర్శకుడు తేజ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. తాను ఈ సినిమాను తీయలేనని స్పష్టం చేశారు.

దర్శకుడిగా ఎన్టీఆర్‌ చిత్రానికి తాను న్యాయం చేయలేకపోతాను అనిపించే చిత్రం నుంచి తప్పుకున్నట్టు చెప్పారు. అయితే అసలు విషయం వేరే ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్‌ పాత్రను ఎలా చూపించాలి.. ఎన్టీఆర్ జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మాత్రమేచూపించాలన్న దానిపై బాలకృష్ణ, తేజ మధ్య తేడా వచ్చింది.

తేజ సలహాలను బాలకృష్ణ పట్టించుకోలేదని చెబుతున్నారు. దీంతో ఇటీవలే ఘనంగా వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంబోత్సవం జరుపుకున్న ఈ చిత్రం నుంచి దర్శకుడు తప్పుకున్నారు.

తేజ తప్పుకోవడంతో రాఘవేంద్రరావు, క్రిష్‌లను బాలకృష్ణ సంప్రదించారు. కానీ మరోచిత్రంలో బిజీగా ఉన్నక్రిష్ తో పాటు రాఘవేంద్ర రావు నుంచి సరైన సానుకూల స్పందన రాలేదని చెబుతున్నారు. దీంతో తానే దర్శకత్వం వహించి తానే హీరోగా సినిమా తీసుకునేందుకు బాలకృష్ణ సిద్ధమయ్యారు.