Home రాజకీయాలు బాబుకు అఖిల షాక్.. బంధం తెగింది.. ఇక ప్రత్యర్థులమే

బాబుకు అఖిల షాక్.. బంధం తెగింది.. ఇక ప్రత్యర్థులమే

SHARE

చంద్రబాబుకే ఝలక్ ఇచ్చారు మంత్రి అఖిలప్రియ. ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి నేపథ్యంలో ఏపీ, అఖిలప్రియ మధ్య సెటిల్‌మెంట్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించగా అఖిలప్రియ మాత్రం సహకరించలేదు.

పంచాయితీ కోసం అమరావతికి రావాల్సిందిగా ఆదేశించగా… అఖిలప్రియ మాత్రం హాజరుకాలేదు. ఏవీసుబ్బారెడ్డి ఒక్కరే వచ్చారు. దీంతో పంచాయితీ గురువారానికి వాయిదా వేశారు. చంద్రబాబు ఆదేశించినా అఖిలప్రియ రాకపోవడంతో టీడీపీ నాయకత్వం సీరియస్‌గా ఉంది.

మరోవైపు భూమా కుటుంబంతో అనుబంధం తెగిపోయిందని ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. తనపై దాడిజరిగిన రోజే భూమా కుటుంబం తనకు ప్రత్యర్థి అయిందన్నారు. 30 ఏళ్ల పాటు ప్రాణాలు పణంగా పెట్టి భూమా కుటుంబం కోసం పనిచేస్తే చివరకు తనపైనే రాళ్ల దాడి చేస్తారా అని ప్రశ్నించారు.

తాను పెద్దపెద్ద దాడులే చూశానని… ఈ రాళ్ల దాడి ఎంత అని వ్యాఖ్యానించారు. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని తాను కాదని… తన ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఏవీ హెచ్చరించారు.