Home రాజకీయాలు టీడీపీ నేతల కోరిక తీరుస్తారట!

టీడీపీ నేతల కోరిక తీరుస్తారట!

SHARE

రాజకీయాలు బలే చిత్రంగా ఉంటాయి! నిన్న మొన్నటివరకూ రాసుకు పూసుకుని తిరిగి, ఒకే కంచం ఒకే మంచం అన్న రేంజ్ లో కలిసున్నవారు సైతం ఉన్నపలంగా బద్ద శతృవులు అయిపోతారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ – టీడీపీల పరిస్థితి ఇలానేఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఈ క్రమంలో టీడీపీ సవాళ్లు, బీజేపీ కౌంటర్లతో ఏపీ రాజకీయం మహా రంజుగా తయారయ్యింది. ఈ క్రమంలో తాజాగా విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఏపీ బీజేపీ సీనియర్ నేత – ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు విష్ణకుమార్ రాజు… టీడీపీతో పొత్తు లేకుండా ఉంటే.. ఇరవై ఎమ్మెల్యే – పది ఎంపీ సీట్లు గెలిచేవాళ్ళమని, 2014లో టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ చాలా నష్టపోయిందని.. బాబుపై రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ఇంతకాలం ఈ కబుర్లు బాబు చెబితే.. ప్రస్తుతం ఆ మాటలతోనే బాబుకు కౌంటర్ వేస్తున్నారు బీజేపీ నేతలు. అనంతరం “దమ్ముంటే కేసులు పెట్టాలి” అంటూ కొందరు టీడీపీ నేతలు చేస్తున్న సవాల్ పై విష్ణు కుమార్ రాజు స్పందించారు. త్వరలోనే వారి కోరిక తీరుస్తామని తేల్చి చెప్పారు. దీంతో ఈ కామెంట్ సంచలనంగా మారింది.

ఈ లెక్కన చూసుకుంటే… రాబోయే రోజుల్లో టీడీపీ నేతలు చేసిన అవినీతిపై బీజేపీ కాస్త గట్టిగానూ, ఘాటుగానూ స్పందించే అవకాశాలున్నయని తెలుస్తుంది! ఇదే క్రమంలో… వైకాపా విషయంలో చిన్నపాటి జోస్యం చెప్పారు విష్ణుకుమార్ రాజు! మే15 తరువాత టీడీపి నుంచి వైసీపీలోకి వలసలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయని ఆయన చెబుతున్నారు.

ఇదే క్రమంలో… తిరుపతిలో ఈ నెల 30న బాబు చేపట్టబోయే దీక్షపై సూటి ప్రశ్నలు సందించారు బీజేపీ నేతలు! ఈ దీక్షలో మోడీ ఇచ్చిన హామీ గురించి మాటాడేముందు.. తాను ప్యాకేజి కి ఎందుకు ఒప్పుకున్నారో చంద్రబాబు చెప్పి తీరాలని అంటున్నారు! మరి చంద్రబాబు… ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి దీక్ష చేస్తారో లేక సైడ్ చేసి పని కానిస్తారో వేచి చూడాలి!!