Home రాజకీయాలు ఏడీఆర్‌ రిపోర్టులో ఐదుగురు టీడీపీ నేతలు

ఏడీఆర్‌ రిపోర్టులో ఐదుగురు టీడీపీ నేతలు

SHARE

అసోసియేషన్‌ ఆఫ్ డెమెక్రటిక్‌ రిఫామ్స్- ఏడీఆర్‌ రిపోర్టులో టీడీపీ ప్రజాప్రతినిధులు చోటు సంపాదించారు. దేశంలో తీవ్ర నేరాలకు పాల్పడిన నేతల జాబితాను తాజాగా ఏడీఆర్‌ విడుదల చేసింది. ఈ రిపోర్టులో మహిళలపై దాడులు చేసిన ప్రజాప్రతినిధుల జాబితాలో ఏపీ నుంచి తెలుగు దేశం పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రమే చోటు సంపాదించారు.

మొత్తం ఐదుగురు టీడీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీరిలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిలో మంత్రులు దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బండారు సత్యనారాయణ, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి ఉన్నారు.

చింతమనేనిపై మొత్తం 23 కేసులున్నట్టు ఏడీఆర్ వెల్లడించింది. వీటిలో తీవ్రమైన నేరాలు 13 ఉన్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే సూరిపై 10 కేసులున్నాయి. బండారు సత్యనారాయణమూర్తిపై 4కేసులున్నాయి. మంత్రి దేవినేని ఉమపై 13 కేసులున్నాయి. అచ్చెన్నాయుడిపై రెండు కేసులున్నట్టు ఏడీఆర్‌ వెల్లడించింది. ఏపీ నుంచి మహిళలపై నేరాలు చేసిన ప్రజాప్రతినిధుల్లో ఐదుగురు కూడా టీడీపీ నాయకులనే కావడం విశేషం.