Home రాజకీయాలు భూమా – ఏవీ… మధ్యలో సైకిల్!

భూమా – ఏవీ… మధ్యలో సైకిల్!

SHARE

అసలే పార్టీ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా అతంతమాత్రంగా ఉంది. ఒకపక్క ప్రత్యేక హోదా పేరున చేసిన మోసం, మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో చేసిన హామీలు గాలికి వదిలేసిన వైనం, టీడీపీ నాయకులు పోటాపోటీలుగా చేస్తున్న అవినీతి! ఈ పరిస్థితుల్లో ఇప్పటికే బాబు అండ్ కో తేరుకోలేనంత ఊబిలోకి దిగిపోతే… ఆయా జిల్లాల్లో టీడీపీ వర్సెస్ టీడీపీ గా సాగుతున్న కొన్ని సంఘటనలు బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయంట. ఇందులో ప్రధానమైనది కర్నూలు జిల్లా వ్యవహారం. ఈ జిల్లాలో బాబుకు రోజు రోజుకీ తలపోటుగా మారుతున్న భూమా అఖిల ప్రియ – ఏవీ సుబ్బారెడ్డిల వ్యవహారం!!

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు సినిమా సీన్లను తలపించడమే కాకుండా… ఒక్కో సారి ఊహించని రీతిలో జిల్లా శాంతిభద్రతలకు సమస్యగా మారుతుందా అనే సందేహాలు కలిగిస్తున్నాయన్నా అతిశయోక్తి కాదేమో! ఇంతకీ ఈస్థాయి పరిస్థితులకు కారణం అధికార పక్ష – ప్రతిపక్ష సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలు కాదు, రాజకీయ పార్టీల గొడవలు కూడా కాదు! దశాబ్దాలుగా భూమా నాగిరెడ్డి కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి.. మంత్రి భూమా అఖిలప్రియల మధ్య నెలకొన్న రాజకీయ విబేధాలే ఈ పరిస్థితికి కారణం అని తెలుస్తుంది. వీరిమధ్య నెలకొన్న గ్యాప్ ప్రభావం కచ్చితంగా సైకిల్ పంక్చర్ కు సాయం చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇందుకు తాజాగా ఆజ్యంపోసిన సంఘటన… ఏవీ సుబ్బారెడ్డి మీద జరిగిన రాళ్లదాడి! బాబు కల్పించుకుంటేనో, ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడితేనో సద్దుమణిగే గొడవలా నిన్నమొన్నటివరకూ కనిపించిన ఈ వ్యవహారం.. తాజాగా సంఘటన పుణ్యమా అని పూడ్చలేనంత స్థాయికి వెళ్లిపోయిందని జిల్లా జనం మైకులముందే చెబుతున్నారు. ఇదే అదనుగా… వచ్చే ఎన్నికల్లో తానేంటో నిరూపిస్తానని ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించడంతో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారినట్లయ్యింది. ఇదే క్రమంలో ఇది సద్దుమణిగే వ్యవహారం కూడా కాదు కాబట్టి… రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ వ్యవహారం కర్నూల్ లో కీలకంగా మారబోతుంది.

కాగా… పార్టీ పిలుపు మేరకు ఏవీ సుబ్బారెడ్డి, దాదాపు 500 మంది పార్టీ కార్యకర్తలతో కలిసి సైకిల్ యాత్రను చేపట్టటం.. వీరి సైకిల్ యాత్ర యర్రగుంట్లకు చేరుకోగానే.. గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు వాహనాల్లో వచ్చి వీరిపై కర్రలతోనూ, రాళ్లతోనూ దాడి చేసి క్షణాల్లో మాయమవడం.. అనంతరం ఈ దాడికి కారణమైన వాహనాన్ని పోలీసులు గుర్తించడం.. ఈ వాహనంపై భూమా అన్న స్టిక్కర్ ఉండటం తెలిసిందే!!