Home సినిమా అయ్యో.. గోర్లు కొరుక్కుంటూ సమంత

అయ్యో.. గోర్లు కొరుక్కుంటూ సమంత

SHARE

సమంత, విశాల్ నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబు తిరాయ్’ తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని మే 11న విడుదల చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మే 9న సమంత నటించిన ‘మహానటి’ విడుదలవుతుండటం.. రెండు రోజుల గ్యాప్‌తో ఈ సినిమా వస్తుండటంతో సమంత అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే తాజాగా తేలిన విషయం ఏమిటంటే మే 11న ‘అభిమన్యుడు’ చిత్రం విడుదల కావడం లేదు. దీంతో సమంత టెన్షన్ పడుతూ గోళ్లు కొరుక్కుంటున్నట్లు ఓ ట్వీట్ చేశారు.

ఈ విషయాన్ని విశాల్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. మా నిర్మాణ సంస్థ ‘వీఎఫ్‌ఎఫ్’‌ను సంప్రదించకుండా బయ్యర్లు తప్పుడు విడుదల తేదీని ప్రకటించారు. తమిళనాడు నిర్మాణ సంఘ‌ రిలీజింగ్‌ కమిటీని సంప్రదించి కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. మేము అఫీషియల్‌గా చెప్పే వరకు మీడియా వారు తప్పుడు రిలీజ్ డేట్ ప్రచారం చేయవద్దు’ అని విశాల్ ట్వీట్ చేశారు.