Home రాజకీయాలు ఆర్కే మార్కు జర్నలిజం… సీక్రెట్ సారీ!

ఆర్కే మార్కు జర్నలిజం… సీక్రెట్ సారీ!

SHARE

వార్తలందు ఎల్లో వార్తలు వేరయా.. జర్నలిజం అందు ఎల్లో జర్నలిజం వేరయా… అనుకోవాల్సిన పరిస్థితికి కొన్ని పత్రికలు మారిపోయాయి. మారిపోయాయి అనేకంటే దిగజారిపోయాయి అంటే బెటరేమో! తాము ఏమి రాసినా జనం చదువుతారు, తాము ఏమి చూపించినా జనం చూస్తారు అనే మూర్ఖపు ముతక ఆలోచనా దోరణి నుంచి బయటకు రాని సదరు మీడియా పెద్దలు.. జన్ర్నలిజం విలువలు కాలరాస్తున్నారనే కామెంట్స్ ఈ మధ్యకాలంలో బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నంలో పవన్ ను, అతని కుటుంబాన్ని మీడియా అత్యాచారం చేసిందనేది జనసేన అధినేత ఆరోపణ. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై నేరుగా దాడికి దిగారు పవన్ కల్యాణ్.

తన తల్లిని అవమానించారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ ఎత్తున ట్వీట్లతో వార్ షురూ చేసిన సంగతి తెలిసిందే. కొందరు మీడియా అధినేతలపై ట్వీట్ల సమర శంఖాన్ని పూరించిన ఆయన… శ్రీని రాజు, రవిప్రకాశ్ అనంతరం.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ఫైరయ్యారు. ఆంధ్రజ్యోతిని – బూతుజ్యోతి అనే రేంజ్ లో పవన్ సదరు పత్రిక పైనా, ఆర్కే పైన్నా ట్వీట్టరో విమర్శల ఆయుధాలు సందించారు.

తాజాగా ఆర్కేని దృష్టిలో పెట్టుకుని ట్వీట్ల వర్షం కురిపించిన పవన్… తెలుగుదేశం పార్టీలో తల్లిని, సోదరిని తిట్టే విభాగానికి ప్రధాన కార్యదర్శి ఎవరో తెలుసా? ఇంకెవరు.. “బూతుజ్యోతి రత్న ఆర్కే”. అని నేరుగా విమర్శించారు!! అనంతరం పాత్రికేయ విలువలతో ఉన్న ఛానెల్స్, పత్రికల వెనుకే నిలబడదాం. మనల్ని, మన తల్లుల్ని, ఆడపడుచుల్ని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి? వాళ్ల టీవీలు ఎందుకు చూడాలి? అని ఫైరయ్యారు.

అంతవరకూ చేసిన విమర్శలు ఒకెత్తు అయితే… తనకు ఆర్కే సీక్రెట్ గా సారీ చెప్పాలని ప్రయత్నిస్తున్నారనే విషయం పవన్ చెప్పడం కాస్త హాట్ టాపిక్ గా మరింది. “గడిచిన ఆరు నెలలుగా నా మీద.. నా అభిమానుల మీదా.. నా పార్టీ కార్యకర్తల మీదా.. ఫిలిం ఇండస్ట్రీ మీదా.. మా అమ్మ మీదా.. భావోద్వేగ అత్యాచారం చేస్తున్నారు. ఇంతటి అనారోగ్యకరమైన మనస్తత్వం ఉన్న మీరు.. ప్రైవేటుగా మాత్రం నాకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సంకేతాలు పంపుతారా?” అని పవన్ తాజాగా ఒక ట్వీట్ చేశారు.

ఆర్కే పరువు అలా తీసిన పవన్.. అక్కడితో ఆగకుండా పబ్లిక్ గా తిట్టేయటం ప్రైవేటుగా సారీలు చెప్పటం వంటివి తనదగ్గర నడవని పని అని సూటిగా చురకలతో కూడిన వార్నింగ్ ఇచ్చారు! మరి దీనిపై ఆంధ్రజ్యోతి అధినేత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో మాత్రం… దీనిపై ఒక కొత్త పలుకో, చెత్తపలుకో, వీక్ డే కామెంటో, వీకెండ్ కామెంటో జనల్లోకి వదులుతారులే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి!!

అయితే… ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది! పత్రికల్లో కొన్ని సార్లు తప్పుడు కథనాలో, అసత్య వార్తలో ముద్రించబడినప్పుడు… సవరణలు వేస్తుంటారు! అది పొరపాటుగా పడిన వాటికి… మరి కావాలని చేస్తున్నట్లుగా అనిపించే రాధాకృష్ణ మార్కు జర్నలిజం.. సవరణలు వేయకుండా చాటుకు వెళ్లి క్షమాపణలు చెప్పడానికి సిద్ధపడటం ఏమిటో… ఆర్కేనే చెప్పాలి!!