Home సినిమా కళ్యాణ్‌రామ్‌.. తమన్నా మూవీ ‘నా నువ్వే’

కళ్యాణ్‌రామ్‌.. తమన్నా మూవీ ‘నా నువ్వే’

66
SHARE

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ తాజా మూవీ ‘నా నువ్వే’ వ‌చ్చే నెల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నది. తాజాగా ఈ హీరో ఏం.ఎల్.ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే నెల 25 న విడుదలకు సిద్ధం అవుతోంది. LA తెలుగు ద్వారా ఈ కూల్ రొమాంటిక్ చిత్రం ఓవర్సీస్ లో విడుదల అవుతుందని పంపిణీదారులలో ఒకరైన విజయ్ కుమార్ తెలిపారు.

కళ్యాణ్ రామ్, తమన్నా ల కాంబినేషన్, ప్రఖ్యాత కెమరామెన్ పి. సి. శ్రీరామ్ ఛాయాగ్రహణం, మ్యూజిక్ డైరెక్టర్ షరెత్ సంగీతం, ప్రముఖకొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్యాలు ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈ పాట “నా నువ్వే” చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది” అని నిర్మాత ల లో ఒకరైన కిరణ్ ముప్పవరపు తెలిపారు.

లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా గా ఉండే ఈ చిత్రం లో, కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి, ప్రియ, సురేఖ వాణి ప్రధాన నటులు. ఈ చిత్రానికి నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి, సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు , సంగీతం: షరెత్ , సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్ , ఎడిటింగ్‌: టి. ఎస్. సురేష్ , కథ, స్క్రీన్‌ప్లే – జయేంద్ర, శుభ, దర్శకత్వం: జయేంద్ర.