Home ప్రత్యేకం టెన్సన్‌‌తో చేతులు వణికాయి.. మహేష్‌బాబు

టెన్సన్‌‌తో చేతులు వణికాయి.. మహేష్‌బాబు

59
SHARE

ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అనే నేను చిత్రం విజయఢంకా మోగిస్తున్నది. భారీ వసూళ్లను సాధిస్తూ బ్లాక్‌బస్టర్‌గా దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో భరత్ అనే నేను సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్స్ మహేష్‌బాబు, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, కియారా అద్వానీ, డీవీవీ దానయ్య తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ మీట్ అనంతరం మహేష్‌బాబు మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ప్రిన్స్ ఆసక్తికరంగా సమాధానం అందించారు.

కొందరు డైరెక్టర్లు నాతో రెండోసారి చేసినప్పడు ఆ ప్రాజెక్టులు సక్సెస్ కాలేదు. చాలా మందితో వర్కవుట్ కాలేదు. ఒక్క పూరీ జగన్నాథ్‌కే సాధ్యపడింది. ఆ తర్వాత కొరటాల శివతో సాధ్యపడింది. సినిమా రిలీజ్‌కు ముందు టెన్షన్‌తో నాకు వణుకు వచ్చింది. గ్లాస్ పట్టుకొంటే చేతులు వణికాయి. శివ గారిని అడుగుదామని అనుకొంటే ఆయన బిజీగా ఉన్నారు.

శ్రీమంతుడు సినిమా తర్వాత గ్రామాల దత్తత తీసుకొన్నారు. భరత్ అనే నేను సినిమా తర్వాత సామాజిక అంశాలపై స్పందిస్తాను. కానీ భయటకు చెప్పుకోలేను. కానీ భరత్ అనే నేను సినిమా ప్రత్యేకమైనది. నా పిల్లల పిల్లలకు చూపించే విధంగా లైబ్రరీలో పెట్టుకొనే సినిమా.

నా సినిమా సక్సెస్ అయినప్పుడల్లా మా నాన్న  ముఖంలో ఆనందం వెలుగుతుంది. ఈ సినిమా చూసి ఆయన బాగా ఉంది అని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన ఓత్ రిలీజ్ అయినప్పుడు నాకు ఫోన్ చేశారు. మన వాయిస్ మాదిరిగా ఉంది అని అన్నాడు. భరత్ అనే నేను సక్సెస్ చాలా రిలీఫ్ ఇస్తుంది.

మా అన్నయ్యకు ఈ సినిమా బాగా నచ్చింది. ఆయనకు శివాజీ గణేషన్, ఎంజీఆర్ అంటే చాలా ఇష్టం. భరత్ అనే నేను చూస్తే వాళ్లు గుర్తొచ్చారని అన్నయ్య చెప్పారు. అది నాకు వచ్చిన పెద్ద కాంప్లిమెంట్. భరత్ అనే నేను సినిమా సక్సెస్ వార్త నాకు మొదట అందింది నా భార్య నమత్ర. అమెరికాలో రాత్రి రెండున్నర గంటలకు సినిమా ముగిసిన తర్వాత ఆమె బ్లాక్‌బస్టర్ అని చెప్పింది.