Home రాజకీయాలు వంచన.. 20 అయిపోయింది, ఇప్పుడు 30!

వంచన.. 20 అయిపోయింది, ఇప్పుడు 30!

81
SHARE

పొట్టిశ్రీరాములు పుట్టిన గడ్డ మీద దీక్ష అంటే వెటకారం, అదో పబ్లిసిటీ వ్యవహారం, చల్లగాలికి మెత్తనిపరుపుపై ప్రజల సాక్షిగా సేదతీరడం అని పలువురు నాయకులు భావిస్తున్న పరిస్థితులు నేడు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాల పోరాటం, ప్రజల ఒత్తిడి మేర ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్న చంద్రబాబు… డెడ్ లైన్ పెట్టుకుని, కొన్ని గంటలు కేటాయించుకుని విశ్రాంతి తీసుకున్నట్లుగా దీక్ష అని పేరెట్టి, కొన్ని కోట్ల ప్రజాధనం ఖర్చెట్టి కూర్చుంటున్నారు. ఇదే క్రమంలో అలాంటి దీక్షే మరోసారి చేస్తారంట బాబు!

దీక్షలు ఒక ప్రచార కార్యక్రమాలు అని ఫిక్సయిపోయారో లేక.. సీరియస్ దీక్షలకు, పబ్లిసిటీ దీక్షలకు తేడా తెలుసుకోలేనంత అమాకత్వంలో ప్రజలు ఉన్నారని భావిస్తున్నారో తెలియదు కానీ… ఈ నెల 20న బెజవాడలో తన పుట్టిన రోజున టిఫిన్ తిన్న అనంతరం.. రాత్రి బోజనానికి ముందు కొన్ని గంటలు దీక్ష పేరు చెప్పి కూర్చున్నారు బాబు! అది తెగ సక్సెస్ అయ్యిందని తానే భావించారో లేక చుట్టూ ఉన్న బ్యాచ్ చెప్పారో తెలియదు కానీ… మళ్లీ అలాంటి హాల్ఫ్ డే దీక్ష ఒకటిచేయాలని నిర్ణయించారు చంద్రబాబు! ఇందుకు ఈ నెల 30వ తేదీన తిరుపతిని వేదికగా చేసుకున్నారు.

బెజవాడలో ఈ నెల 20న బాబు చేపట్టిన దీక్ష విషయంలో… మీడియా మైలేజీకి “ఫిల్మ్ చాంబర్ లో పవన్” గండి కొడితే… దీక్ష అనంతరం ప్రజలు ఏమి మాట్లాడుకోవాలని బాబు భావించారో అది తప్ప అన్నీ మాట్లాడుకునేలా తన స్పీచ్ తో బాలయ్య చేసుకొచ్చారు! దీంతో అనుకున్న మైలేజ్ రాలేదని భావించారో లేక ఇంకా ఎక్కువ మార్కులు కొట్టేయాలని తలచారో కానీ.. మరోసారి దీక్ష చేస్తామని ప్రకటించారు చంద్రబాబు!

ఈ క్రమంలో దీక్షల పేరు చెప్పి మరో వంచనకు తెరలేపిన బాబు అండ్ వ్యవహారంపైనా మోడీ ఏపీ ప్రజలకు చేసిన వంచన కారణంగా… ఈ నెల 30న వంచన దినాన్ని నిర్వహించాలని ఫిక్సయిన ఏపీ విపక్షం వైకాపా.. అందుకు విశాఖను వేదికగా చేసుకుంది! ఈ క్రమంలో ఇంతకాలం టీడీపీ చేస్తున్న విమర్శ… “వైకాపా నేతలు మోడీని ఎందుకు ప్రశ్నించరు అని”! ఈ విమర్శకు కూడా ఈ సభ క్లారిటీ ఇవ్వనుందని అంటున్నారు విశ్లేషకులు! ఇక ఇదే వేదికపై ఏపీ ప్రజలను పూర్తిస్థాయి వంచన చేసిన చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు వచ్చి పడతాయనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు!!

ఎందుకంటే… ఎవరు అవునన్నా కాదన్నా ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు వైఖరే ప్రధాన కారణం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని ప్రతీసారి తనదైన శైలిలో ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెప్పుకొస్తున్నారు వైకాపా అధినేత. దీంతో ఈ నెల 30న అటు బాబు వంచన.. ఇటు జగన్ వంచనదినం పేరున చేయబోయే హడావిడితో రాష్ట్ర రాజకీయాలు మరోసారి దీక్షలపేరు చెప్పి వేడెక్కనున్నాయి!!