Home రాజకీయాలు బాబు కోసం పవన్.. ఈసారి డిఫరెంట్!!

బాబు కోసం పవన్.. ఈసారి డిఫరెంట్!!

SHARE

ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం ద్వారా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంశం అత్యంత కీలకం కాబోతుంది. ఈ క్రమంలో బాబు తనకున్న పోల్ మేనేజ్ మెంట్ తో సహా ఎన్ని శక్తులు కలిసి వచ్చినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇంక ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ క్రమంలో బాబుకు మరో అత్యంత ప్రధాన శతృవుగా తయారయ్యారు పవన్ కల్యాణ్. ఇప్పటికే వైకాపా నేతలు.. హోదా ఉద్యమంలో దూసుకుపోతుంటే, మరో పక్క వైకాపా అధినేత జనాలకు అత్యంత చేరువయ్యి, ప్రభుత్వ పైతీరును, బాబు ద్వంద్వ వైఖరినీ ఎండగడుతుంటే… ఇటు పవన్ తనవంతుగా బాబుకు పక్కలో బల్లెంలా తయారయ్యారనేది విశ్లేషకుల మాటగా ఉంది.

సాదారణంగా అధికారపక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దాలు జరుగుతుంటాయి.. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ.. ఏపీలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం రాజకీయాలు పక్కనపెట్టి… ప్రత్యేక హోదాపైనా, ప్రజా సమస్యలపైనా పోరాడుతూ ముందుకు కదులుతుంటే.. నిన్నమొన్నటివరకూ కలిసి కాపురం చేసిన పవన్ – చంద్రబాబు కారాలూ మిరియాలూ నూరుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ రభస వల్ల టీడీపీకి ఎక్కువ నష్టమా, లేక జనసేన మొగ్గలో ఉండగానే తుంచేసుకునే పరిస్థితి వల్ల పవన్ కే నష్టమా అనే అంశంపై తీవ్ర చర్చలు నడుస్తునాయి. ఈ క్రమంలో విశ్లేషకులు తేల్చిన అంశం ఈ రభస వల్ల బాబుకే నష్టం అని!!

అవును… ఎవరు అవునన్నా కాదన్నా. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అటు బీజేపీ, ఇటు పవన్ తోడు రాకుంటే బాబు అధికారంలోకి వచ్చేవారు కాదనేది జగమెరిగిన సత్యం! ఈ క్రమంలో బీజేపీ దూరం అయిపోయింది.. పవన్ అత్యంత భారీ శతౄవుగా తయారవుతున్నాడు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబు ఒంటరిగా పోటీచేయాల్సిన పరిస్థితి!! అది చాలదన్నట్లు.. పవన్ రూపంలో కొత్త తలపోటు బాబుకు తగిలింది. పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తల వల్ల పవన్ కు అధికారం వస్తుంది అని చెప్పలేం కానీ… బాబుకు అవసరమైనంత మేర నష్టం కలిగించడంలో వారి పాత్ర కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఏపీలో కాపులు కొంతమంది ముద్రగడ పక్షాన్న ఉంటే.. మరి కొందరు పవన్ తరుపున ఉన్నారనేది కాపునాయకుల మాటగా ఉన్న తరుణంలో… ఇప్పటికే ముద్రగడ రూపంలో బాబుకు ఆ సామాజిక వర్గ ఓటర్లు చాలా దూరంగా ఉన్న పరిస్థితి. ఇదే క్రమంలో మిగిలిన వారు పవన్ మాట కాదనలేని పరిస్తితి. దీంతో ఇప్పటికే కాపుల రిజర్వేషన్ పేరున ఆ సామాజిక వర్గానికి బాబు అన్యాయం చేశారనే కామెంట్స్ ముద్రగడ కోటరీ నుంచి వినిపిస్తున్నమాట. దీంతో ఆ సామాజిక వర్గం బాబుకు దాదాపు దూరం అయినట్లే. ఈ క్రమంలో ఈసారి కూడా బాబు కోసం పవన్ పనిచేస్తారు కానీ… ఈసారి బాబు ఓటమి కోరుకుని మరింత తీవ్రంగ పనిచేస్తారు., అని స్పష్టం అవుతుంది!!