Home రాజకీయాలు బాలయ్య బాలయ్య… బాబు గుండెల్లో గోలయ్యా!

బాలయ్య బాలయ్య… బాబు గుండెల్లో గోలయ్యా!

SHARE

చంద్రబాబు చేసిన ఒక పూట “పస్తు దీక్ష” సంగతేమో కానీ… ఆ దీక్ష చేసిన రచ్చ అంతా ఇంతా కాదు! ఆ దీక్ష వల్ల రాష్ట్రానికి ఒరిగేదీ లేదనేది.. బాబు దీక్షకు ముందే అంతా అనుకున్న సంగతి! సరే వచ్చే 1శాతం మైలేజీ అయినా తమకు ఫ్లస్సే కదా అని బాబు అండ్ కో ఫిక్సయ్యారు.. ఒక పూట పస్తున్నారు.. సుమారు 30కోట్ల రూపాయల ప్రజాధనం గంగలో పోశారు! అయినా కూడా బాబుకు వచ్చింది ఏమిటి.. రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం సంగతి దేవుడెరుగు.. టీడీపీకి ఒరిగిందేమిటి? ప్రస్తుతం టీడీపీ నెతలు ఆత్మావలోకనం చేసుకుంటున్న పరిస్థితి! దీనికి రెండు కారణాలు బాబు అండ్ కో భావిస్తున్నా.. వాటిలో బలమైనది మాత్రం బాలయ్య స్పీచ్చే అని పలువురు టీడీపీ సీనియర్లు భావిస్తున్నారట.

నేడు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చంద్రబాబే కారణం అనేది జగమెరిగిన వాస్తవం. ఈ క్రమంలో వైకాపా నేతలు ఈ ఉద్యమాన్ని నాలుగేళ్లు సజీవంగా ఉంచడంతో పాటు తాజాగా పీక్స్ కి తీసుకెళ్లారు. ఈ క్రమంలో బాబు కూడా ప్రత్యేక హోదా సంజీవని కాదు అన్న నోటితోనే.. హోదా కావాలి అని పలికారు. ఈ క్రమంలో జనాలను తానుకూడా హోదా గురించి పోరాడుతున్నాను అని నమ్మించే క్రమంలో భాగంగా.. తన పుట్టిన రోజున ఒక పూట దీక్ష చేయ నిర్ణయించారు.. ఒకపూట దీక్షలో కూర్చున్నారు. అయితే అదే సమయంలో పవన్ కల్యాన్.. ఫిల్మ్ చాంబర్ లో చేసిన హడావిడి.. బాబు దీక్షకు రావాల్సిన పబ్లిసిటీ మైలేజికి గండికొట్టింది. ఆ బాద ఒకెత్తు అయితే.. ఆ దీక్ష శిభిరంలో బాలయ్య స్పీచ్ బాబుకు మరింత బీపీ తెచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.

ఆ దీక్ష వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యం అనే విషయం తాము కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి టీడీపీ నేతలది. ఈ క్రమంలో మొడీపై బాలయ్య చేసిన విమర్శలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ఇటు ఏపీ ప్రజలకు ఎలాగూ ఆ దీక్ష సంగతి గుర్తుపెట్టుకునే పరిస్థితి లేని క్రమంలో.. అటు బీజేపీ నెతలు సైతం దీక్ష, అది చేయడానికి కారణం అయిన సంగతులను పక్కదారిపట్టించి… బాలయ్య స్పీచ్ పై విమర్శల వర్షాలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బాబు దీక్ష పూర్తిగా సైడ్ అయిపోవడంతో పాటు.. ఢిల్లీ సంగతి దేవుడెరుగు, పక్కనే ఉన్న హైదరాబాద్ ను కూడా తాకని పరిస్థితి. ఇంకా గట్టిగా మాట్లాడితే.. బాబు దీక్ష ఢిల్లీకి చేరలేదనేది ఎంత వాస్తవమో.. బాలయ్య మాటల ఘాటు మాత్రం బీజేపీ నేతలకు బలంగా చేరిందని అంటున్నారు!! దీంతో ఇప్పటికే ఉన్న టెన్షన్స్ చాలవన్నట్లు… బాలయ్య స్పీచ్ అనంతర పరిణామాలతో బాలయ్య బాలయ్యా… బాబు గుండెల్లో గోలయ్య అంటున్నారట తమ్ముళ్లు!!