Home రాజకీయాలు టీడీపీకి నాగబాబు వార్నింగ్

టీడీపీకి నాగబాబు వార్నింగ్

64
SHARE

పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా పావులు కదులుపుతున్న టీడీపీపై నాగబాబు పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం పవన్‌ కల్యాణ్ అన్ని వదిలేసి రాజకీయాల్లోకి రావడంతో…కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

అలాంటి వారు రకరకాలుగా కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. కుటుంబసభ్యులను కూడా నోటికొచ్చినట్టు తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము సినిమాల్లోనే ఉండి ఉంటే ఎవరూ ఏమీ అనేవారు కాదన్నారు. కానీ రాష్ట్రం కోసం పవన్‌ కల్యాణ్ అన్ని వదిలేసి రాజకీయాల్లోకి రావడం కొందరికి నచ్చలేదన్నారు. ఇలాంటి వారిని దుమ్ముదులిపేలా పవన్‌ కల్యాణ్‌ రాబోతున్నారని వ్యాఖ్యానించారు.

ఇదివరకు ఒక సారి కుదరలేదని… ఈసారి మాత్రం కుదిరి తీరుతుందన్నారు.. త్వరలోనే ఒక్కొక్కడికి ఉంటుందని హెచ్చరించారు నాగబాబు.

సినిమా పరిశ్రమలో నెంబర్‌ స్థానంలో ఉండి…. కోట్ల సంపాదన వదిలేసి నిస్వార్థంగా ప్రజాసేవ చేసేందుకు పవన్‌ కల్యాణ్ వస్తున్నారని నాగబాబు చెప్పారు. పవన్‌ కల్యాణ్ వెనుక ఎవరూ లేరని అనుకోవద్దని.. చాలా మంది ఉన్నారని నాగబాబు హెచ్చరించారు.

టీడీపీ అనుకూల మీడియా నారా లోకేష్ , చంద్రబాబు కనుసన్నల్లో పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా నెగిటివ్ కాంపేయిన్‌ నడుపుతున్న నేపథ్యంలో నాపేరు సూర్య ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.