Home రాజకీయాలు కాల్పుల కథ.. మీ కుటుంబసభ్యులతో ఆయన సంబంధం చెప్పు..

కాల్పుల కథ.. మీ కుటుంబసభ్యులతో ఆయన సంబంధం చెప్పు..

76
SHARE

ప్రధాని మోడీని కొజ్జా అంటూ చంద్రబాబు దీక్షలో నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీనేతలు ఆయనపైకేసులు పెట్టారు. బాలకృష్ణపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

బీజేపీ నేత రఘునందన్‌రావు కూడా ఒక టీవీ చానల్ చర్చలో బాలకృష్ణను దులిపేశారు. అసలు చంద్రబాబు దీక్షలో బాలకృష్ణ ముఖం ఎలా ఉందో అద్దంలో చేసుకోవాల్సిందన్నారు. తాము కూడా ఒక ఎంపీటీసీ స్థాయి నేతతో బాలకృష్ణ అచ్చం కొజ్జాలాగా ఉన్నారని తిట్టిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దయతలిస్తే బాలకృష్ణ కాల్పుల కేసు నుంచి బయటపడ్డారన్నారు. లేకుంటే ఈపాటికి చిప్పకూడు తింటూ బతకాల్సిన వ్యక్తి బాలకృష్ణ అనిఅన్నారు. అసలు ఆ రోజు బాలకృష్ణ ఎందుకు కాల్పులు జరిపారో చెప్పాలన్నారు.

ఆయనకు బాలకృష్ణ కుటుంబసభ్యులకు మధ్య ఉన్న సంబంధబాంధవ్యాలు ఏంటని ప్రశ్నించారు. బాలకృష్ణ గురించి సోషల్‌ మీడియా ఓపెన్ చేసి చూస్తే అతడి గురించి తెలుస్తుందన్నారు. సోషల్‌ మీడియాను పరిశీలిస్తే బాలకృష్ణ తాడు లేకుండా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందన్నారు. బాలకృష్ణ తెలుగు మాట్లాడితేనే జనానికి అర్థమై చావదని.. ఇక ఆయనకు హిందీ అవసరమా అని ప్రశ్నించారు.