Home ప్రత్యేకం టీవీ9 అధినేతకు పవన్ షాకింగ్ మెసేజ్.. రవిప్రకాశ్‌ భార్యకు ఉచిత సలహా..

టీవీ9 అధినేతకు పవన్ షాకింగ్ మెసేజ్.. రవిప్రకాశ్‌ భార్యకు ఉచిత సలహా..

68
SHARE

తెలుగు మీడియా అధినేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాడిని తీవ్రం చేశారు. పవన్ ట్వీట్ చేసిన మెసేజ్‌లు ఇవే.. రవి ప్రకాశ్ నేను మీకు ప్రత్యేకంగా ఓ మెసేజ్ పంపుతాను. కొద్ది సమయం నాకు ఇవ్వమని అడుగుతున్నాను. నా సందేశం కోసం మీరు వేచి చూడాల్సిందే. మిమ్మల్ని వెయిటింగ్‌లో పెట్టినందుకు క్షమించండి అని ట్వీట్ చేశారు.

టీవీ9 శ్రీనిరాజుకు ఓ వీడియోను ట్యాగ్ చేసి పవన్ చురకలంటించారు. ఈ వీడియోను మీ తల్లికి, భార్యకు, చెల్లెలికి చూపించండి. అంతేకాకుండా ఆ వీడియో ద్వారా సాధించిన విజయాన్ని వారికి వివరించండి. కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి ఎలాంటి పనులు చేస్తున్నారో కూడా తెలియజేయండి అంటూ పవన్ మరో ట్వీట్ చేశారు.

రవి ప్రకాశ్ భార్య గారికి నమస్కారాలు. మీ భర్త మంచి వ్యక్తే అమ్మ. కానీ మీ పిల్లల్ని టీవీ9 చూడకుండా దూరంగా పెట్టింది. నేను ఇలా సూచించినందుకు మీ పిల్లలు ఎందుకని ప్రశ్నించవచ్చు. అందుకు ఈ వీడియోను చూపించండి.