Home రాజకీయాలు పాపం బాబు.. పవన్ గట్టిగా కొట్టాడుగా!

పాపం బాబు.. పవన్ గట్టిగా కొట్టాడుగా!

77
SHARE

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధర్మ దీక్ష పేరిట శుక్రవారం విజయవాడలో ఒక్కపూట (ఆఫ్టర్ బ్రేక్ ఫాస్ట్.. బిఫోర్ డిన్నర్) దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షకు.. పొట్టిశ్రీరాములు చేసిన దీక్ష రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు తమ్ముళ్లు. విజయవాడ మొత్తం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగులు, లైవ్ ప్రసారాలు, బస్సుల్లో జనాల తరలింపులు.. ఒక్కటా.. పబ్లిసిటీలో దుమ్ము దులిపేశారు. ఈ దీక్ష ఢిల్లీ ని తాకుతుందబి హడావిడి చేశారు. కానీ.. ఇంతలోనే పవన్ రూపంలో బాబు దీక్ష పక్కకు పోయింది.. అటు జనాలకు, ఇటు మీడియాకు సెకండ్ ఆప్షన్ అయిపోయింది!!

తనపైనా, తనకుంటుంబంపైనా నారాలోకేష్ ఆధ్వర్యంలోని కొన్ని ఛానళ్లు, పత్రికలు తనపై మీడియా అత్యాచారం చేస్తున్నారని ఆరోపించిన పవన్.. ఫిల్మ్ చాంబర్ కి వెళ్లి నానా హంగామా చేశారు. ఇదే సమయంలో అల్లూ అర్జున్, రాం చరణ్ లు కూడా పవన్ కి తోడుగా రావడంతో మీడియా ఫోకస్ మొత్తం అటుపోయింది! ఫిల్మ్ చాంబర్ లో పవన్ ఏం చేస్తున్నారు.. లోపల ఉన్నారా.. బయట ఉన్నారా.. లోపల ఎవరితో మాట్లాడుతున్నారు.. ఏమి మాట్లాడుతున్నారు.. పవన్ తో పాటు లోపలికి ఎవరెవరు వెళ్లారు.. ఇలాంటి విషయాలతో మీడియా.. ప్రోగ్రాంస్ మీద ప్రోగ్రాంస్ చేసింది. దీంతో బాబు దీక్ష లైవ్ ఆపేసి పవన్ పైకి మీడియా కాన్సంట్రేషన్ షిప్ట్ అయిపోయింది.

తనపై వర్మ వ్యాఖ్యల వెనుక కొంతమంది మీడియా చానెళ్లున్నాయని.. ఆ వ్యవహారం మొత్తానికి లోకేష్ ప్రధాన సూత్రధారి అని పవన్ బహిరంగంగానే ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ఎల్లో మీడియా తనను వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా టార్గెట్ చేసిందని చెప్పుకొచ్చిన పవన్.. ఇదే క్రమంలో సుమారు 5 గంటల పాటు ఫిల్మ్ చాంబర్లో హడావిడి చేశారు. ఈ సమయంలో పవన్ తోపాటు మెగా ఫ్యామిలీ మొత్తం చాంబర్ వద్ద ల్యాండ్ అయిపోవడంతో బాబు దీక్షకు అనుకున్న కవరేజీ, జనల్లో మైలేజీ రాలేదు! ఈ పోటీ వాతావరణంలో ఎల్లో మీడియా మాత్రం ఏమి చేస్తుంది.. ఒక పక్క చంద్రబాబు ముక్క, పరో పక్క పవన్ ముక్కా వేసి నడిపించే ప్రయత్నాలు చేసి కవర్ చేసింది!!

దీనిపై మన విశ్లేషణలే కాదు.. బాబు కూడా తెగ ఫీలయిపోయారంట. ధర్మపోరాట దీక్ష ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బాబు కూడా… రాష్ట్రం కోసం దీక్ష చేపడితే దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పవన్ ను పరోక్షంగా విమర్శిస్తూ.. వ్యక్తిగత సమస్యలపై స్పందనకు ఈరోజే దొరికిందా అని ప్రశ్నించారు. రేపు చేసుకోవచ్చు కదా అని ఒక సూచన కూడా చేశారు. పాపం బాబు ఎంత ప్రయత్నించినా ఆపుకోలేక ఇలా మీడియా ముందే బయటపడిపోయారు. అంటే ఆలోచించుకోవచ్చు… బాబు దీక్షకు పవన్ ఏ రేంజ్ లో గండికొట్టారు అనేది!