Home రాజకీయాలు లోకేష్ పై పవన్ డైరెక్ట్ అటాక్!

లోకేష్ పై పవన్ డైరెక్ట్ అటాక్!

86
SHARE

పవన్ పై, అతడి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు, దానిపై ఓ సెక్షన్ మీడియాలో జరుగుతున్న చర్చలు గురించి అందరికీ తెలిసిందే! దీనిపై ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి నాగబాబు, అల్లు అరవింద్ తమదైన శైలిలో స్పందించారు. ఈ క్రమంలో ఈ మేటర్ పై పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. తన ట్వీట్స్ ద్వారా సరికొత్త సంచలనానికి తెరదీశారు. ఎవ్వరూ ఊహించని రీతిలో ట్విట్టర్లో స్పందించారు. పవన్ ట్వీట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి.

గత కొన్ని రోజులుగా తనపైనా, తనతల్లిపైనా జరుగుతున్న చర్చావేదికలు, ఒక వర్గం మీడియా చేస్తున్న రచ్చపై పవన్ తాజాగా స్పందించారు. ఇంతకాలం శ్రీరెడ్డిని నడిపిస్తుంది వైకాపా నేతలని రకరాకాల విశ్లేషణలు చేసిన, వంకర ఆరోపణలకు తనదైన క్లారిటీ ఇచ్చారు పవన్. ఈ రచ్చ మొత్తానికి, తనపై జరుగుతున్న దాడికి తెరవెనక కథానాయకుడు లోకేష్ అని పవన్ తాజాగా ఆరోపించారు. అలా అని గాలి ఆరోపణలు చేయకుండా.. నేరుగా పేర్లు ప్రస్థావిస్తూ పవన్ క్లారిటీ ఇచ్చారు.

ఈ మొత్తం వ్యవహారం.. రామ్ గోపాల్ వర్మ అనే ఒక దర్శకుడు, శ్రీసిటీ ఓనర్ (త్వ్9 ఓవర్) శ్రీనిరాజు (10కోట్లు ఇచ్చిన వ్యక్తి), టీవీ9 సీఈవో రవిప్రకాష్ కలిసి ఆడుతున్న నాటకంగా అభివర్ణించిన పవన్.. వీరి ముగ్గురి ద్వారా లోకేష్, అతని స్నేహితుడు రాజేష్ కిలారు కలిసి కొన్ని రోజులుగా తనపై ఈ రకమైన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

పవన్ తాజాగా ట్విట్టర్ వేదికగా చేసిన ఈ ఆరోపణలతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుందనే చెప్పాలి. ఈ వ్యవహారం అంతా గమనించి, పవన్ మాట నమ్మిన అభిమానులు మాత్రం… అమ్మ లోకేషూ ఇదంతా నీపనా… నువ్వే చేయాల్సిందంతా చేసి వైకాపాపై బురద జలాలని చూశావా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

ఆ సంగతులు అలా ఉంటే… లోకేష్ పై ఇప్పటికే బహిరంగంగా అవినీతి ఆరోపణలు చేశారు పవన్. అనంతరం వాటికి సంబందించి తనవద్ద ఆధారాలు ఉన్నాయని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడేమో తాజా వ్యవహారం మొత్తం లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం మొత్తం రాజకీయ రంగుపులుముకున్నట్లయ్యింది.

ఇదే క్రమంలో టీవీ9, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి లపై నేరుగా దండెత్తిపవన్… ఈ మీడియా ద్వారా తనపైనా, తన కుటుంబంపైనా, తనను అభిమానించేవారిపైనా నిరవధిక మీడియా అత్యాచారం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారగా… ఇది లోకేష్ వ్యవహారంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది!!