Home రాజకీయాలు మహేష్ బాబు సినిమాపై మహేష్ రివ్యూ!

మహేష్ బాబు సినిమాపై మహేష్ రివ్యూ!

8839
SHARE

సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా “భరత్ అనే నేను” ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన సంగతి తెలిసిందే. గతంలో కొరటాల – మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన “శ్రీమంతుడు” సినిమా సక్సెస్ తో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. పైగా మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్ర అనేసరికి.. ఆసక్తి రెట్టింపయ్యింది. అభిమానులు ఈ సినిమాపై పూర్తిస్థాయిలో సూపర్ హిట్ అని ఫిక్సయిపోయారు. అయితే ఈ సినిమాపై ఇప్పటికే టాక్స్ వచ్చేశాయి.

ఈ క్రమంలో బెనిఫిట్ షోతోనే మంచి హిట్ టాక్‌ ను సంపాదించుకున్నదనే రివ్యూల నడుమ.. సినిమా క్రిటిక్ కత్తి మహేష్ తన రివ్యూను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

“”భరత్ అనే నేను” సినిమా సింపుల్ స్టోరీనే కానీ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. మహేష్ తన క్యారెక్టర్‌లో లీనమైపోయి నటించారు. కొరటాల శివ నిజమైన ప్రజాస్వామ్యంలో ఏదైతే కచ్ఛితంగా సాధ్యమవుతుందో దానిని కళ్లకు కట్టినట్టు చూపించారు. “భరత్ అనే నేను” ఒక స్ఫూర్తిదాయకమైన సినిమా. ప్రతి ఒక్కరూ వెళ్లి చూడండి”” అంటూ కత్తి మహేష్ తన రివ్యూలో పేర్కొన్నారు.

ఈ సినిమా బాగున్నప్పటికీ, కత్తి మహేష్ రివ్యూ కరెక్టే అయినప్పటికీ… పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి గిల్లే రేంజ్ లో మహేష్ రివ్యూ ఉందనేది ఒక వర్గం జనాల అభిప్రాయం. మహేష్ బాబు సినిమాపై ఇంత సాఫ్ట్ గా స్పందిస్తూ.. అందరినీ చూడమని మరీ అడిగిన కత్తి.. పవన్ సినిమాల విషయంలో మాత్రం ఎక్కడ నెగిటివ్ ఉంటుందా అని చూస్తారని చెప్పుకొస్తున్నారు పవన్ ఫ్యాన్. అంతేలే… మనసులో ఒక అభిప్రాయం పాతుకు పోయాక.. ఏమి చేసినా ఆ కోణంలోనే కనిపిస్తుంది మరి.. అని మహేష్ ఫ్యాన్స్ రీ ట్వీట్లు చేస్స్తున్నారు!!