Home రాజకీయాలు చినబాబు పద్దతి బాబుకి మరో ప్రతిపక్షం!

చినబాబు పద్దతి బాబుకి మరో ప్రతిపక్షం!

167
SHARE

ఇప్పటికే జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకత, రాష్ట్ర వ్యాప్తంగా బాబుకు వ్యతిరేకంగా వీస్తున్న పవనాలు.. మరోవైపు జనాలకు రోజు రోజుకీ దగ్గరైపోతున్న జగన్! ఈ పరిస్థితుల్లో బాబు కుడితిలో పడ్డ ఎలుకలా ఇబ్బంది పడుతున్నారని టీడీపీ సీనియర్లు చెప్పుకుంటున్న వైనం. ఈ క్రమంలో బాబుకు చినబాబు రూపంలో మరో ప్రతిపక్షం తయారవుతుందని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. చినబాబు వ్యవహరిస్తున్న తీరు, తీసుకుంటున్న అపరిపక్వ నిర్ణయాలు బాబుకు మహా ఇబ్బందిగా తయారయ్యాయంట!

మొదటి నుంచీ కూడా లోకేష్ వైఖరిపై టీడీపీలో సీనియర్లు, ఒక వర్గం నేతలు ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే! సీనియర్లు అనే గౌరవం ఏమాత్రం ఇవ్వరని, తన తండ్రి సమకాలీనులు అనే ఆలోచన లోకేష్ కు కొందరి నేతలపై ఏమాత్రం లేదని చెప్పుకొస్తున్న వైనం. ఈ క్రమంలో తాజగా కొదరు సీనియర్లు, మరి కొందరు నేతలు కలిసి చినబాబుకుపై కంప్లైంట్ చేశారని తెలుస్తుంది! లోకేష్ వ్యవహారశైలి తమకు చాలా ఇబ్బందిగా ఉందని వారంతా బాబువద్ద వాపోతున్నారట. ఈ క్రమంలో కొందరు టీడీపీ నేతలు అయితే… చినబాబు వ్యవహారశైలిని కారణంగా చూపించి పార్టీని వీడటానికి సైతం సిద్దపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సీఎం కొడుకుని, మంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని అన్న ఆలోచనతో లోకేష్ నడుచుకుంటున్నారని.. తన మాటే శాసనం అన్న పద్దతిలో ముందుకు కదులుతున్నారని అంటున్నారు. పార్టీపై ఉన్న ప్రేమతో ఎంత తగ్గించుకున్నా, ఎంత సర్ధుకుపోతున్నా కూడా లోకేష్ వ్యవహారం తమ మనోభావాలను దారుణంగా కించపరుస్తుందని ఆఫ్ ద రికార్డ్ చెప్పుకుని బాదపడుతున్నారట కొందరు టీడీపీ నేతలు. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ అయినా దొరుకుతుంది కానీ… లోకేష్ అపాయింట్ మెంట్ తమకు దొరకడం లేదని, సీనియర్లు అనే కనీస ఇంగితం లేకుండా గంటల తరబడి తన కేబిన్ బయట పడిగాపులు కాయిస్తున్నారని చెప్పుకుంటున్నారట.

ఈ క్రమంలో బాబుకు వైకాపా నేతలే కాకుండా.. లోకేష్ పుణ్యమా అని టీడీపీలోనే మరో ప్రతిపక్షం తయారవుతుందని, దానికి చినబాబు పద్దతే కారణం అని, చినబాబు పద్దతి ఇలానే ఉంటే పార్టీని వీడటానికి కూడా తాము సంసిద్దులం కావాల్సి ఉంటుందని చెప్పుకుంటున్నారట. మరి ఈ విషయాలపై బాబు పుత్రుడిని వెనకేసుకొచ్చి పార్టీని చీల్చుకుంటారో, బలహీన పరుచుకుంటారో లేక చినబాబుని కంట్రోల్లో పెడతారో అనేది ఆసక్తికరంఆ మారింది!