Home సినిమా ‘నా పేరు సూర్య’కి పనిచేసిన హాలీవుడ్ స్పెషలిస్ట్ లు

‘నా పేరు సూర్య’కి పనిచేసిన హాలీవుడ్ స్పెషలిస్ట్ లు

SHARE

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాంగ్రీ సోల్జర్ గా, అను ఇమ్యానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ‘నా పేరు సూర్య’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి ముస్తాబవుతోంది. రచయితగా హిట్స్ అందుకున్న వక్కంతం వంశీ తొలిసారి మెగాఫోన్ పట్టి.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’. ఈ సినిమాలో సంగీత ద్వయం విశాల్-శేఖర్ లు స్వరపరిచిన పాటలు పాటలను ఈనెల 22న రిలీజ్ చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేసినట్లు తెలిసింది. అమెరికాలో చిత్రీకరించిన “లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో” అనే పాటను హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ జోసెఫ్ లబిసి చిత్రీకరించినట్టు చిత్ర బృందం తెలిపింది.

జోసెఫ్ లబిసి ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మరియు ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ సినిమాటోగ్రాఫర్, ఈయన తన టాలెంట్ ని పాప్ అల్బమ్స్ షూట్ చేయడంలోనే ఎక్కువుగా ఉపయోగించారు. ప్రముఖ పాప్ సింగర్స్ అరియాణ గ్రాండే, ఎనరిక్యూ ఇగ్లిసియ్స్, నిక్కిమినాజ్ వంటి వారితో వర్క్ చేశారు.
ఈ పాటలో అను ఇమ్మాన్యుయేల్, బన్నీలకు కాస్ట్యూమ్స్ కూడ పాపులర్ హాలీవుడ్ కాస్ట్యూమ్స్ డిజైనర్ ఆన్ మేరీ హూంగ్ డిజైన్ చేశారని వెల్లడించింది. ఈమె గతంలో జెన్నిఫర్ లోఫెజ్, నిక్కీ మినాజ్ వంటి పాప్ సింగర్స్ తో కలిసి పనిచేశారు.
రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో కె.నాగబాబు సమర్పణలో శిరీష శ్రీధర్, బన్నీ వాసులు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ May 4 న థియేటర్లోకి రానుంది.