Home రాజకీయాలు ఆఫ్టర్ బ్రేక్ ఫాస్ట్.. బిఫోర్ డిన్నర్.. ఖర్చు ఇంతా?

ఆఫ్టర్ బ్రేక్ ఫాస్ట్.. బిఫోర్ డిన్నర్.. ఖర్చు ఇంతా?

SHARE

ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైకాపా, సాధన సమితి, అన్ని రాజకీయ పక్షాలు కలిసి రాష్ట్ర బంద్ చేసిన సంగతి తెలిసిందే. ఎవరి ఒత్తిడి, మరెవరి తరలింపు లేకుండా జనాలు అంతా ఎవరికి వారే రోడ్లపైకి వచ్చి.. హోదాపై తమకున్న అభిప్రాయాన్ని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ బంద్ కు బీజేపీ దూరంగా ఉందంటే అర్ధం చేసుకోవచ్చు కానీ.. అధికార టీడీపీ కూడా గైర్హాజరయ్యింది. సరే. తప్పించుకు తిరగడం టీడీపీకి పరిపాటిగా మారింది అని సరిపెట్టుకుంటే… పోరాటం ఢిల్లీలో చేయాలి తప్ప రాష్ట్రంలో చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ బంద్ వల్ల ఆర్టీసీకి 12 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పుకొచ్చారు బాబు! దీనిపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అంతా చేస్తున్నారు కదా తానుకూడా ఏదొకటి చేయకపోతే జనాలు కొడతారనే భయంతో తాను కూడా “ఆఫ్టర్ బ్రేక్ ఫాస్ట్.. బిఫోర్ డిన్నర్” మధ్య నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించారు! అందుకు ఎంచుకున్న ప్రదేశం ఢిల్లీ కాదు.. విజయవాడ! ఈ క్రమంలో బాబు పబ్లిసిటీతో కలిపి ఈ వ్యవహారానికి, ఒకరోజు సంబరానికి సుమారు రూ.20కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా రాష్ట్ర ఖజానా నుంచే అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!! కుమారుడి తెలుగు ట్యూషన్ కే పరోక్షంగా ఖజానాకు కన్నం పెట్టిన బాబు… ఈ ప్రచార ఆర్భాటం విషయంలో వెనకడుగు వేస్తారా.. డౌటే లేదు!

పైగా… ఈ వ్యవహారంకోసం సుమారు 200 ఆర్టీసీ బస్సులు, 100 ప్రైవేటు బస్సులను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిందట. ఈ లెక్కన బాబు ఉద్దేశ్యం ఏమిటనేది సుస్పష్టం అవుతుందనేది పలువురి అభిప్రాయంగా ఉంది! ఏది ఏమైనా… ఈ దీక్ష వల్ల బాబుకు తమ్ముళ్లు ఊహించినట్లుగా ఒనగూరే ప్రయోజనం కంటే.. ఈ విషయాలన్నీ జనాలకు తెలిసిన తర్వాత జరిగే నష్టమే ఎక్కువనేది విశ్లేషకుల మాటగా ఉంది. అయితే.. ఈ ఖర్చు విషయం తెలిసిన అనంతరం ప్రతిపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి!! ఇదే క్రమంలో దీక్ష అనంతరం రాష్ట్రానికి కలిగి ప్రయోజనం ఏంటో కూడా బాబు.. ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది!!