Home సినిమా హీరోయిన్‌తో స్టైలిష్‌ స్టార్‌ సెల‍్ఫీ

హీరోయిన్‌తో స్టైలిష్‌ స్టార్‌ సెల‍్ఫీ

SHARE

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. సైనికుడిగా డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌తో అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. మే 4న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్ బుధవారంతో పూర్తయ్యింది.

అభిమానులకు షూటింగ్ పూర్తయ్యిందన్న విషయాన్ని వెల్లడించిన స్టైలిష్ స్టార్‌ ‘నా హీరోయిన్ అను ఇమ్మాన్యూల్‌ అడిగిన తొలి, చివరి కోరిక ఓ సెల్పీ.. షూటింగ్‌ పూర్తయిన తరువాత అను ఇమ్మాన్యూల్‌ తో నా తొలి పర్సనల్‌ ఫొటో’ అంటూ అనుతో దిగిన సెల్ఫీని ట్వీట్‌ చేశాడు బన్నీ. ఈ సినిమాను లగడపాటి శ్రీధర్‌, నాగబాబులు నిర్మిస్తున్నారు.