Home సినిమా వర్మ ఓ క్రిమినల్: అల్లు అరవింద్

వర్మ ఓ క్రిమినల్: అల్లు అరవింద్

SHARE

ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తనను బాధించాయని సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నికృష్టుడని, సాఫ్ట్ మర్డర్ క్రిమినల్ అని ఆయన పేర్కొన్నారు. తాను మెగా ఫ్యామిలీకి పెద్దగా ఇన్ని రోజులు సహనంగా ఉన్నానని, కానీ కొన్ని సంఘటనలు చూశాక ప్రెస్‌మీట్ పెట్టానన్నారు. శ్రీరెడ్డి ఆరోపణలపై సినీ పరిశ్రమ సానుకూల దృక్పథంతో ఉందన్నారు.

‘మూడు తరాలుగా ఇండస్ట్రీనే నమ్ముకున్నాం. కానీ కొందరు అనవసరంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. నేను రాంగోపాల్ వర్మను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను. వర్మ ఓ నికృష్టుడు అని చెబుతున్నా. సినీ పరిశ్రమలో పుట్టి పెరిగిన వర్మ.. ఇప్పుడు తల్లిలాంటి ఇండస్ట్రీకి ద్రోహం చేస్తున్నాడు. శ్రీరెడ్డితో పవన్ కల్యాన్‌ను తిట్టించింది తానేనని వర్మ స్వయంగా ఒప్పుకున్నాడు. శ్రీరెడ్డి విషయం బయటకు చెబుతుందని తెలిసే.. తన వెదవ తెలివితేటలు చూపిస్తూ వర్మ హడావుడిగా వీడియో రిలీజ్ చేశాడు. వర్మ నీ బతుక్కి ఇదంతా అవసరమా.. నీకు పవన్‌పై ఉన్న కోపాన్ని శ్రీరెడ్డితో తీర్చుకోవాలి అనుకున్నావంటూ’ అల్లు అరవింద్ మండిపడ్డారు.