Home రాజకీయాలు టీడీపీలో ఎవరిబ్రతుకు వారు చూసుకుంటున్నారా?

టీడీపీలో ఎవరిబ్రతుకు వారు చూసుకుంటున్నారా?

755
SHARE

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గమనిస్తే.. రాజకీయాలన్నీ ప్రత్యేక హోదా చుట్టూ తిరుగుతున్నాయనే అనుకోవాలి. ఇంతకాలం చంద్రబాబు సాగించిన పాలన, ఆ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, జరిగిన అవినీతి సంగతులు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది. ఈ క్రమంలో పార్టీతో అంటకాగుతూ, పార్టీ పేరుమీద గెలిచే పరిస్థితులు లేవు కాబట్టి.. వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకుంటూ, ఎవరి బ్రతుకు వారు చూసుకుంటే బెటరని టీడీపీ నేతలు భావిస్తున్నారనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం టీడీపీ జెండా చూసో, చంద్రబాబు ఫోటో చూసో, లేక ఈ నాలుగేళ్లు బాబు పాలన ప్రోగ్రస్ రిపోర్ట్ చూసో టీడీపీ బీ-ఫారం పై పోటీచేసే నేతలకు ఓట్లు పడతాయనే ఆలోచనలు, నమ్మకాలు మెల్లమెల్లగా సన్నగిల్లుతున్నాయి. ఈ క్రమంలో అప్పటికి ఏపార్టీలో టిక్కెట్టు దొరికితే ఆ పార్టీ తరుపున పోటీ చేద్దాం.. అలా కానిపక్షంలో టీడీపీ నుంచే పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చిన కూడా.. పార్టీ గెలుపు దేవుడెరుగు, కనీసం తమకు తాము నాలుగు ఓట్లు తెచ్చుకునేలా ప్లాన్ చేసుకుంటే బెటరనే ఆలోచనకు టీడీపీ నేతలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి రైల్వే స్టేషన్ దీక్ష అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎంపీలంతా కలిసివచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేదు.. ఎమ్మెల్యేలంతా ఒక్కతాటిపైకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.. ఈ సమయంలో బాబు మాట టీడీపీ నేతలు తూచా తప్పక పాటిస్తారనే సంకేతాలు కనిపించడం లేదు! ఈ పరిస్థితుల్లో పార్టీని, పార్టీ జెండాని పక్కనపెట్టి… నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా కాస్తో కూస్తో ప్రతిష్ట పెంచుకుంటే బెటరని టీడీపీ నేతల భావనగా కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.

ఢిల్లీ వెళ్లి అంతా పోరాడదామా అనే ఆలోచన కూడా బాబు చేయకపోవడానికి కారణం కూడా… టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బాబు మాటను పెడచెవిన పెడుతున్నారని అంటున్నారు తమ్ముళ్లు! ఈ విషయంలో ఇప్పటికే హోదా పోరాటం దేవుడెరుగు.. కనీసం రాష్ట్రంలో ఎన్నికల యాత్రలాగా బస్సుయాత్ర చేద్దామని పిలుపునిచ్చిన బాబుకు షాకింగ్ రిప్లై ఇచ్చారు టీడీపీ ఎంపీలు! దీంతో బస్సు యాత్ర కాస్త పోస్ట్ పోన్ అయ్యింది! ఈ పరిస్థితుల్లో ఎవరినీ కదిలించే పరిస్థితిలో లేని బాబు… తనకు తానే ఒకపూటైనా దీక్ష చేసి సానుభూతి పొందాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు! దీంతో… టీడీపీలో అధిష్టానం, అధినేత, క్రమశిక్షణ కలిగిన పార్టీ వంటి సంగతులు గతం అని భావించిన టీడీపీ నేతలు… ఎవరి బ్రతుకు వారు చూసుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు!!