Home రాజకీయాలు 73 < 68: ఈ తెలివి లోకేష్ సొంతం!

73 < 68: ఈ తెలివి లోకేష్ సొంతం!

SHARE

లాజిక్కులందు టీడీపీ లాజిక్కులు వేరయా… తెలివితేటలందు లోకేష్ తెలివితేటలు వేరయా అనే సామెతలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది!! 68 పెద్ద సంఖ్యనా… 73 పెద్ద సంఖ్యనా? అందరికీ తెలిసి 73! కానీ… లోకేష్ దృష్టిలో 68 పెద్దది! అవును లోకేష్ బాబు తాజాగా ఇచ్చిన క్లారిటీ ఇదేమరి!

విషయానికొస్తే.. ఏపీకి జరిగిన అన్యాయం మేరకు, ప్రత్యేక హోదా రానందుకు నిరసనగా ఈనెల 20న విజయవాడలో ఒకపూట దీక్ష చేయనున్నారు చంద్రబాబు! అందరికీ ఢిల్లీ వెళ్లిపోరాడండి అని చెప్పే చంద్రబాబు.. తానుమాత్రం విజయవాడలో దీక్ష చేస్తున్నారు.. ఆ లాజిక్ బాబుకే తెలియాలనుకోండి అది వేరే విషయం! ఆ సంగతి అలా ఉంటే… ఈ దీక్షకు సంబందించి ఫాలో అప్స్ చేస్తున్న నారాలోకేష్.. ఇటు అధికారులను అటు ఐటీ టీం ను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారంట. ఈనెల 19కే దీక్షా శిభిరంలో ఏర్పాట్లు అన్నీ పూర్తయిపోవాలని, ఎల్.ఈ.డీ. స్క్రీన్లు పెట్టాలని, సిటీ మొత్తం హోర్డింగులతో నింపాలని, సోషల్ మీడియా మొత్తం పబ్లిసిటీతో హోరెత్తించాలని సూచిస్తున్నారట. సరే… ప్రచారంలో వాళ్లకు మించిన వారెవరు అని లైట్ తీసుకుంటే.. ఇక్కడ తనకుమాత్రమే ఉన్న ప్రత్యేక జ్ఞానంతో ఒక లాజిక్ తీశారు లోకేష్!

68ఏళ్ల వయసులో ఒక వ్యక్తి దీక్ష చేయడం మామూలు విషయం కాదని, ఇది ఒక పవిత్ర దీక్ష అని, ఇంతకు మించి గొప్ప సంగతి రాష్ట్ర చరిత్రలో లేదు అన్న రేంజ్ లో చెప్పుకొస్తున్నారు. అయితే ఇక్కడ లోకేష్ అండ్ కో మరిచిపోతున్నది ఒక విషయం ఉంది. వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 73 ఏళ్లు, ఆరోగ్యం పూర్తిగా సహకరించని పరిస్థితి. అయినా కూడా డెడ్ లైన్స్ పెట్టుకోలేదు, ఒకపూటే పస్తుంటా అని చెప్పలేదు, పొద్దున్న కూర్చుని సాయంత్రానికి చక్కబడిపోతా అని ప్రకటించలేదు. ఆరోగ్యం సహకరించకపోయినా అలుపెరగని పోరాటం చేశారు.. ప్రాణాలకు తెగించి పోరాట పఠిమ చూపించారు. ఈ పెద్దాయన చేసిన దీక్షపై సానుభూతి ఎలాగూ లేని టీడీపీ నేతలు మాత్రం.. ఇది ఒక డ్రామా అని చెప్పుకొచ్చారు. ఆరోగ్యం సహకరించక ఆయనను బలవంతంగా ఆస్పత్రికి తరలిస్తే… వికెట్ పడింది అని నిస్సిగ్గు కామెంట్స్ చేశారు.

కానీ… బాబు మాత్రం 68 ఏళ్ల వయసులో ఒక పూట.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏసీ నీడన కూర్చుంటే దాన్ని ఒక పవిత్ర కార్యంగా, పవిత్ర దీక్షగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే నిస్సిగ్గు రాజకీయం మరొకటి ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 73ఏళ్ల వయసులో ఒక ఎంపీ సీరియస్ గా చేసిన దీక్షను డ్రామా అన్న టీడీపీ నేతలు… 68ఏళ్ల వయసులో ఒక వ్యక్తి ఒక పూట దీక్ష చేస్తుంటే దాని మాత్రం పవిత్ర కార్యం అంటున్నారు.. తాము చేస్తే అది సంసారం అన్న పద్దతిలో!!

ఈ లాజిక్ విన్నవారు మాత్రం ఇంతకు మించి పూర్ లాజిక్ ఏమైనా ఉంటుందా అని స్పందించడం కొసమెరుపు. పోనీ ఈ 68ఏళ్ల వయసులో అయినా.. హోదాపై కేంద్రం ఒక ప్రకటన చేసేవరకూ దీక్ష చేస్తాం అని చెబుతున్నారా అంటే అదీ లేదు. పొద్దున్న టిఫిన్ తిని కూర్చుంటాం.. రాత్రి బోజన సమయానికి ముగిస్తాం అన్న చందంగా దీక్ష చేయడంపై సర్వత్రా వెటకారపు కామెంట్స్ వినిపిస్తున్నాయి!