Home రాజకీయాలు ఏప్రిల్ ఇరవైపై జగన్ సూపర్ సెటైర్!

ఏప్రిల్ ఇరవైపై జగన్ సూపర్ సెటైర్!

SHARE

రాజకీయాల్లో ఊకదంపుడు ప్రసంగాలు అందరూ చేస్తారు కానీ… చేసే ప్రసంగంలో మెరుపులు, విసిరే విమర్శల్లో చలోక్తులు ఉండటంతో పాటు సూటిగా సుత్తి లేకుండా విమర్శలు చేయడం ఒక కళ! అవి కూడా ఏదో కావాలని చేస్తున్నట్లు కాకుండా అర్ధవంతంగా చేసే నాయకులు అరుదు! ప్రస్తుతం పాదయాత్రలో జనాలకు మరింత చేరువవుతున్న వైకాపా అధినేత జగన్.. తన ప్రసంగంలో వాడిని, తన విమర్శల్లో వేడిని రోజు రోజుకూ పెంచుకుంటూ పోతున్నారు. నిన్నమొన్నటివరకూ పిట్టకథలు చెబుతూ జనాలకు అర్ధమయ్యేలా బాబుపై ఫైరయిన జగన్.. తాజాగా బాబు బర్త్ డే డేట్ ను తనకు అనుకూలంగా మలచుకుని బాబుపై సెటైర్ల వర్షం కురిపించారు.

ప్రజా సంకల్ప యాత్ర 138వ రోజు కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో బాబు, ఆయన చేయబోయే దీక్షపై జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన పుట్టిన రోజు ఏప్రిల్ 20న ఒక రోజు బాబు దీక్ష చేస్తారట.. ఆయనది ఫోర్ ట్వంటీ దీక్ష అని వైఎస్ జగన్ అన్నారు. ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసిన రోజున చంద్రబాబు కూడా తన ఎంపీలతో రాజీనామా చేయించి దీక్షలో కూర్చోబెడితే దేశం మొత్తం చర్చ జరిగేదని, కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేదని చెప్పిన జగన్… అలా చేయకుండా ఇప్పుడు మాత్రం ఏప్రిల్ 20న బాబు కొంగ జపం చేస్తారట అని జగన్ విమర్శించారు.

బాబు పుట్టిన నెల 4, తేదీ 20… ఈ రెండింటిని పక్కపక్కన పెట్టిన జగన్… 420 దీక్షగా దీనికి నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఈ కామెంట్ అనంతరం తనదైన శైలిలో అటు చంద్రబాబు, ఇటు దేవినేని ఉమ, నారా లోకేష్ లపై తనదైన చేశారు. “ఈ నియోజకవర్గంలోకి రాగానే నాతో ప్రజలు అన్నమాట ఏంటో తెలుసా? అన్నా.. అన్యాయపు రాజుగారి దర్భార్లో ఈయన (దేవినేని ఉమ) ఓ అవినీతి మంత్రి అన్నారు. చంద్రబాబు మూడుపులు ఎంత రావాలో నిర్ణయిస్తే వాటిని మూటకట్టి చేరవేసి, అందులో వాటాలు పంచుకునే వారిలో ఈ మంత్రి ఒక్కరూ అని చెబుతున్నారు. పట్టిసీమ పోలవరం రాజధాని భూములు ఇసుక మాఫియా వరకు ఆ రాజు ఈ మంత్రి దోపిడీ టీడీపీ పాలనలో మనం చూస్తున్నాం” అని జగన్ ఫైరయ్యారు.

పురాణాలు చదివేటప్పుడు చాలామంది రాక్షసులు భకాసురుడు రావనాసురుడు వంటి పేర్లు విన్నామని.. కానీ ఇక్కడ ఇసుకాసురులు ఉన్నారని జగన్ ఆరోపించిన జగన్… ఈ ఇసుకాసురులకు చంద్రబాబు బాస్ అని క్లారిటీ ఇచ్చారు! కృష్ణా నది సాక్షిగా జరుగుతున్న ఇసుక మాఫియా, లైసెన్సులు లేని బోట్ల దందాలపై జగన్ నిప్పులు చెరిగారు. జగన్ పాదయాత్రలో బాబు అండ్ స్థానికి టీడీపీ నేతలపై చేస్తున్న విమర్శలు రోజు రోజుకీ తీవ్రరూపం దాల్చడంతో పాటు వాస్తవాలు ప్రజలకు మరింతగా చేరవేసే పనికి పూనుకున్నట్లు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు!