Home రాజకీయాలు బాబును రెండువైపులా వాయించేశారుగా!

బాబును రెండువైపులా వాయించేశారుగా!

SHARE

ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా జరిగిన అన్యాయానికి నిరసనగా ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపునకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. సమితి ఇచ్చిన పిలుపునకు రాష్ట్రంలోని ప్రదాన పార్టీలు వైసీపీ సీపీఐ సీపీఎం లోక్ సత్తా జనసేన తదితర పార్టీలన్ని మద్దతుగా నిలిచి బంద్ ను సక్సెస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వెల్లువెత్తిన మద్దతుకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వరుసపెట్టి బాబును ఏకిపారేశారు!

ఈ సందర్భంగా టీడీపీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వైఖరిలపై నిప్పులు చెరిగారు చలసాని, రామకృష్ణ. రాష్ట్రానికి నష్టం కలిగించే ఈ తరహా బంద్ లను రాష్ట్రంలో నిర్వహించడం కాదని చేతనైతే ఢిల్లీలో నిర్వహించాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన శ్రీనివాస్… రాష్ట్రానికి జరిగిన నష్టంపై రాష్ట్రంలో కాకుండా ఉత్తరప్రదేశ్ లోనో, మధ్యప్రదేశ్ లో ధర్నాలు బంద్ లు నిర్వహించామంటారా? సూటిగా ప్రశ్నించారు. తాము చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలపాల్సిన గురుతర బాధ్యతను మరిచిన బాబు.. ప్రజలు సంపూర్ణంగా సహకరించిన బంద్ పై వ్యతిరేఖ వ్యాఖ్యలు చేస్తారా? అని మండిపడ్డారు.

అనంతరం స్పందించిన రామకృష్ణ… తమను ఢిల్లీలో ధర్నాలు చేయాలంటూ సూచించే చంద్రబాబు… తాను మాత్రం తన దీక్షకు విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగా తన జన్మదినమైన ఈ నెల 20న విజయవాడలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన చంద్రబాబు.. తమకు సూచించినట్లుగానే ఒక్కరోజు ఉపవాస దీక్షను ఢిల్లీలోని జంతర్మంతర్ వద్దో ప్రధాని నివాసం ముందో నిర్వహించి దమ్మూ ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ఘాటుగా ప్రశ్నించారు.

ఈ లెక్కన చూసుకుంటే… అటు ప్రతిపక్ష వైకాపా, ఇటు ప్రజల వ్యతిరేకతతో పాటు ఇటు సమితి, అటు వామపక్షాల వ్యతిరేకతను కూడా బాబు సంపాదించుకున్నట్లయ్యింది. బాబు చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంటుందన్న రేంజ్ లో ఫైరయిన ఈ నేతలు… బాబుకు సూచించిన సూచనలు, చేసిన సవాళ్లు మాత్రం ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. నిజమే కదా… బాబు తన ఒక్కరోజు దీక్షను ఢిల్లీలో చేస్తే దేశం మొత్తం చర్చనీయాంశం అయ్యే అవకాశాలున్నాయి కదా అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. విజయవాడలో బాబు దీక్ష వల్ల పేపర్స్ లో ఫోటోలు తప్ప ప్రజలకు ఒరిగే ప్రయోజనం ఏమిటో బాబే చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు!!