Home రాజకీయాలు 25 ఎంపీలు… ఈ ఆలోచన బాబుకు తట్టలేదా?

25 ఎంపీలు… ఈ ఆలోచన బాబుకు తట్టలేదా?

554
SHARE

ఏపీలో రాష్ట్ర బంద్ ఫుల్ సక్సెస్ అయ్యింది. వైకాపా, జనసేన, సమితి, వామపక్షాల సౌజన్యంతో రాష్ట్రప్రజల పూర్తి సహకారంతో బంద్ ఫుల్ సక్సెస్ అనే చెప్పాలి. ప్రస్తుతం టీడీపీ నేతలకు ఈ మాట మింగుడు పడటం లేదు. దానికి కారణం మోడీ అంటే ఉన్న భయం అని తాజా విశ్లేషణలు వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంకోసం ఐదుగురు ఉన్న వైకాపా రాజినామాల అస్త్రాలు సందిస్తే.. నిరాహార దీక్షలు చేస్తే.. టీడీపీ ఎంపీలు మాత్రం ఆ సాహసం చేయకపోవడం, పార్లమెంటు సాక్షిగా ఆ ధైర్యం చేయకపోవడం ఈ విశ్లేషణకు బలం చేకూరుస్తుంది.

ఇంతకూ ఆ విషయం ఏమిటంటే… ఇంతకాలం కేవలం గాసిప్స్ గా మిగిలిన “బాబుకు మోడీ అంటే భయం..” అనే మాట వాస్తవం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు కావాలని అడుగుతున్న బాబు.. ప్రస్తుతం ఉన్న 20మందితో ఏమి చేస్తున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 20 కి 25 ఉన్న తేడా కేవలం ఐదుగురు ఎంపీలు. ఇప్పటికే ఆ ఐదుగురు ఎంపీలు దీక్షలు చేసి, హోదా పోరాటం విషయంలో రాజీపడని పరిస్తితిలో ఉన్నారు. ఈ క్రమంలో బాబు తలచుకుంటే ఇప్పటికీ 25మంది ఎంపీలు రెడీగా ఉన్నట్లే. ఇక ఒప్పుకుని, దైర్యం చేయాల్సింది చంద్రబాబు మాత్రమే!

పనికిమాలిన రాజకీయ ఆలోచనలు లేకుండా.. బాబు పిలిస్తే రావడానికి జగన్, తన ఎంపీలు ఎప్పుడూ సిద్దమే. ఈ క్రమంలో ఐదుగురు వైకాపా సభ్యులపై పడటం కంటే.. తనవద్ద ఉన్న ఎంపీలతో బాబు ఇప్పుడు కూడా పోరాటం చేయడానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ 25మందీ టీడీపీ జెండాలు కప్పుకునేవారే కావాలనుకోవడం తప్పించుకుతిరిగే ఆలోచనగానే చూడాలి. ఇలాంటి పరిష్కారాలు ఉన్నా కూడా బాబు పోరాటం చేసే దైర్యం చేయరు. కారణం.. మోడీ కన్నెర్ర చేస్తారని. బాబుపైకి ఎన్ని విమర్శలు చేసినా, ప్రజాసానుభూతికోసం ఎంత హడావిడి చేసినా.. మోడీ అంటే బాబుకు పీకల్లోతు భయం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

బాబు ఇప్పుడు రండి అని పిలిస్తే వైకాపా ఎంపీలు రెడీ.. ఇక మిగిలిన టీడీపీ ఎంపీలను బాబు ఢిల్లీకి పంపి కలిసి పోరాడమంటే.. పని సులువు అవుతుంది. అందరూ కలిసి పోరాటం చేస్తే కచ్చితంగా కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది.. అని ప్రజలు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయం బాబుకు తెలియంది కాదు. అయినా కూడా తన ఎంపీలను ఢిల్లీ నుంచి పీచే ముడ్ అనిపించేశారు బాబు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న విశ్లేషకులు… మోడీపై పైకి ఎన్ని కబుర్లు చెప్పినా… బాబుకు లోలోపల భయం మామూలుగా లేదని చెబుతున్నారు. పైన చెప్పుకున్న పరిష్కారమార్గాలు ఉన్నా కూడా, అవి బాబుకు తెలిసినా కూడా ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవడంలేదో బాబుకే తెలియాలి. ఒక వ్యక్తి భయం.. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం ఈ రేంజ్ లో ఉంది మరి!!