Home రాజకీయాలు యువ ఎంపీపై బాబు గుర్రు!

యువ ఎంపీపై బాబు గుర్రు!

1157
SHARE

ఏమి జరిగినా తనవల్లే అని జనం అనుకోవాలి.. ఏమి సాధించినా అది తన ప్రమేయమే అని జనం అనుకోవాలి.. ఫలితం రాకపోయినా పర్లేదు కానీ, దానికి సంబందించిన పోరాటం క్రెడిట్ మాత్రం తనకే రావాలి.. తన పార్టీ నేతలైనా సరే, తనకంటే ఎక్కువ చేయకూడదు.. ఒకవేల చేసినా కూడా ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసెయ్యాలి.. ఇవి చంద్రబాబు ఆలోచనలుగా, మానసిక పరిస్థితిగా పలువురు అభివర్ణిస్తుంటారు! ఈ విషయం తెలిసిన సీనియర్లు కాస్త జాగ్రత్తగా ఉంటుండగా, ఉడుకురక్తం మీద ఉన్న యువనాయకులు ఈ బాబు ఆలోచనలు తెలియక అత్యుత్సాహం చూపి దెబ్బతింటున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి! ఈ క్రమంలో తాజాగా కింజరపు రామ్మోహన్ నాయుడు దెబ్బతిన్నారని అంటున్నారు!

ఏపీ ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్ వంటి విషయాల్లో కేంద్రం అనుసరించిన వైఖరి, బాబు చేస్తున్న రాజకీయంపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేసినా, టీడీపీ ఎంపీలు మాత్రం కనీసం రాజీనామాలు చేసే ఆలోచన కూడా చేయలేదు! అయితే… టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాత్రం ఏపీలోని విపక్షాలు బంద్ పాటిస్తున్న సమయంలో తన సొంత నియోజకవర్గం శ్రీకాకుళంలోని ప్రధాన రైల్వే స్టేషన్ శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస)లో దీక్ష చేపట్టారు. రాత్రంతా తన దీక్షను కొనసాగించారు!

ఇంతవరకూ బాగానే ఉంది కానీ… ఈనెల 20న తన పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు దీక్ష చేపట్టాలని బాబు నిర్ణయించుకున్న సమయంలో తనకంటే ముందు ఒక యువ ఎంపీ ఈ ఆలోచన చేయడం, దాన్ని అమలుపరచడంపై బాబు కాస్త గుర్రుగా ఉన్నారని అంటున్నారు! ముందుగా తాను దీక్ష చేసిన అనంతరం మిగిలిన నాయకులు వారి వారి నియోజకవర్గాల్లో దీక్షలో, ధర్నాలో చేస్తే.. వారు అధినేతను ఆదర్శంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు లేదా.. తనను తన నేతలు ఫాలో అవ్వడం సంతోషంగా ఉందని బాబు చెప్పుకోవచ్చు! అంతే కానీ… తనకంటే ముందు తన ఎంపీలు ఇలాంటి ఆలోచన చేయడం బాబుకు ఏమాత్రం నచ్చలేదని తెలుస్తుంది!!