Home రాజకీయాలు వైరల్: ఒక ఫోటో… ఎన్నో క్లారిటీలు!

వైరల్: ఒక ఫోటో… ఎన్నో క్లారిటీలు!

SHARE

జగన్ బలం అంతా రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే! కడప పొలిమేర, రాయలసీమ హద్దులు దాటితె జగన్ ఒక సామాన్య నేత! మిగిలిన ఆంధ్రా ప్రాంతంలో జగన్ కి అంత ఫాలోయింగ్ ఏమీ లేదు! పైగా విజయవాడ, గుంటూరు అయితే ఇంక ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు.. అక్కడ జగన్ ప్రభావం శూన్యం! ఈ రెండు జిల్లాలు టీడీపీ కంచుకోటలు! రాజకీయాలను, అభిమానాలను, నమ్మకాలను కులాలతోనూ, మతాలతోనూ, ప్రాంతాలతోనూ ముడిపెట్టే నాయకులు చెప్పిన మాటలు ఇవి! అభిమానానికి అలాటివి ఏమీ ఉండవని, పార్టీలకు కంచుకోటలు అనే రోజులు పోతున్న దశలో అంతా ఉన్నామని నమ్మాల్సిన రోజులివి. కమ్మ సామాజికవర్గ ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జగన్ కు అభిమానులు ఉండరని, జనాలు వెంటరారని భ్రమపడినవారి ఆశలు నీరుగార్చిన ఫోటో ఒకటి తాజాగా ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.

ఇదిగో.. ఇక్కడ మీరు చూసిన ఫోటో ఎన్నో రాజకీయ విమర్శలకు, రాజకీయ అంచనాలకు, అనాలోచిత ప్రకటనలకు, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న ముతక వైఖరి నేతలకు సమాధానం చెప్పిన ఫోటో. గుంటూరు, విజయవాడల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగన్ యాత్రకు జనాలు రారని టీడీపీ నేతలు పలికిన బీరాలకు సమాధానం చెప్పిన ఫోటో ఇది. దుర్గమ్మ సాక్షిగా.. విజయవాడ వంతెన ఊగిపోయిన క్షణం.. ఇసుకవేస్తే రాలనంత జనం జగన్ కి తోడుగా నడిచిన నిమిషం ఈ ఫోటో బందింపబడింది! కిలోమీటర్ల పొడవునా జనాలు జగన్ కు నీరాజనాలు పడుతూ, నమ్మకమైన నాయకుడు దొరికాడని.. కులమత ప్రాంతాలకు అతీతమైన “మనిషి” నాయకుడై వస్తున్నాడని జనాలు జగన్ వెంట పాదం కదిపారు.. అడుగులో అడుగువేశారు!

బెడవాడ బ్రిడ్జి.. బాబు అండ్ కోలను బిత్తరపోయేలా చేసింది. టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. టీడీపీ అనుకూల మీడియా ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి ధైర్యం చేయలేని ఫోటో గా ఇది చరిత్ర సృష్టించిందని చెప్పినా అతిశయోక్తి కాదేమో.

ఏది ఏమైనా… ఈ ఫోటో చాలా విషయాలపైన క్లారిటీ ఇచ్చిందనే చెప్పాలి. అందులో మొదటిది… జగన్ కు రాయలసీమలో మాత్రమే బలం ఉందని చెప్పే మాట అవాస్తవమని! ఇంకొకటి.. జనం నమ్మడం మొదలుపెడితే దానికి కులం, మతం, ప్రాంతం అడ్డురావని! జనాలకు జననేతలు కావాలి కానీ.. కుల నేతలు, మత నాయకులు, ప్రాంతీయ పాలకులు కాదని! మరొకటి.. జగన్ కు అన్ని ఏరియాల్లోనూ పట్టు ఉందని! పార్టీలకు కంచుకోటలు అనే రోజులు పోయాయని.. అవి బద్దలైపోతున్నాయని!