Home రాజకీయాలు తెలుగ‌మ్మాయి రోహిణి సింధూరికి ఈసీ క్లీన్‌చిట్‌

తెలుగ‌మ్మాయి రోహిణి సింధూరికి ఈసీ క్లీన్‌చిట్‌

SHARE

ముక్కుసూటిగా ఉండే అధికారుల‌కు ఎన్ని తిప్ప‌లు ఎదుర‌వుతాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అందునా.. రాష్ట్ర మంత్రుల‌తో త‌ల‌ప‌డిన‌ప్పుడు ఈ ఇబ్బందులు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయి. అలాంటి కోవ‌కు చెందిన హాసన్‌ జిల్లా కలెక్టర్‌ రోహిణి సింధూరికి రాష్ట్ర ఎన్నికల అధికారులు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. హాసన్‌కు చెందిన మంత్రి ఏ.మంజు, రోహిణిపై పలు ఆరోపణలు సంధించి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఎన్నికల అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ మేరకు మైసూరు ప్రాంతీయ కమిషనర్‌ విచారణ చేసి రాష్ట్ర ఎన్నికల అధికారులకు నివేదిక అందించారు. నివేదిక అనంతరం రోహిణి సింధూరికి క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సంజీవ్‌ కుమార్‌ తెలిపారు.

హాస‌న్ కు చెందిన మంత్రి మంజుతో కొద్దికాలంగా గొడ‌వ‌లున్న సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో హాసన్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఏ.మంజు….ఎన్నికల అధికారుల ఆత్మస్దైర్యం దెబ్బతినేలా మంత్రి వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌ రోహిణి ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి మంజు ఆమెపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తాను కోడ్‌ ఉల్లంఘించలేదని, తనపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, ఆ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని మంత్రి తన లేఖలో కోరారు. అందుకు సమాధానంగా కలెక్టర్‌ ప్రాదేశిక కమిషనర్‌కు రాసిన లేఖలో ఈ ఆరోపణలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన ఈసీ సింధూరికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.