Home సినిమా దిల్‌ రాజు లెక్క తప్పిందా?

దిల్‌ రాజు లెక్క తప్పిందా?

SHARE

దిల్‌ రాజు నిర్మాతగా సినిమా సక్సెస్‌ పర్‌ఫెక్ట్‌గా క్యాలిక్యులేట్‌ చేస్తూ విజయాలు అందుకుంటోన్న.. డిస్ట్రిబ్యూటర్‌గా మాత్రం వరుస మిస్టేక్స్‌ చేస్తూనే వున్నాడు. స్పైడర్‌, అజ్ఞాతవాసి, జై లవకుశ కూడా నష్టాలే మిగల్చడంతో పెద్ద సినిమాల పంపిణీ జోలికి పోరాదని డిసైడ్‌ అయ్యాడు. మీడియం బడ్జెట్‌ సినిమా పంపిణీ హక్కుల్ని హోల్‌సేల్‌గా తీసేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

తొలిప్రేమ చిత్రాన్ని పంపిణీ చేసిన దిల్‌ రాజుకి పెట్టిన డబ్బులు తిరిగొచ్చాయి. ‘కృష్ణార్జున యుద్ధం’ తేడా అవదనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులు ఏకమొత్తంగా తీసేసుకున్న దిల్‌ రాజుకి నష్టాలు తప్పేట్టు లేవు. పూరి రూపొందించిన మెహబూబా చిత్రం హక్కులు తీసుకున్న దిల్‌ రాజు దాంతో అయినా పంపిణీదారునిగా పూర్వ వైభవం తెచ్చుకుంటాడా అనేది చూడాలి.