Home సినిమా నా పేరు సూర్య సెట్స్ లో మెగాస్టార్

నా పేరు సూర్య సెట్స్ లో మెగాస్టార్

434
SHARE

 

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం లోని సాంగ్ షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ స్టూడియో లో వేసిన గ్రాండ్ సెట్లో జరుగుతోంది. ఈ సాంగ్ సెట్లో కి మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. బన్నీ డాన్స్ చేస్తున్నంత సేపు చిరు ఎంజాయ్ చేశారు. సాంగ్ తనకు బాగా నచ్చిందని మెచ్చుకున్నారు. చిత్ర యూనిట్ తో కలిసి సినిమా విశేషాల్ని అడిగి తెలుసుకున్నారు.  మెగాస్టార్ చిరంజివి గారితో పాటు గీతాఆర్ట్స్ అథినేత అల్లు అర‌వింద్ గారు కూడా విచ్చేశారు.

మెగాస్టర్ చిరు తో కలిసి అల్లు అర్జున్, అను ఇమ్మాన్యువల్ లు అదిరి పోయే కాస్ట్యూమ్స్ లో మాస్ అన్న మాదిరిగా కనిపిస్తున్నారు. ఇక దర్శకుడు వక్కంతం వంశీ, అల్లు అరవింద్, శిరీష, శ్రీధర్ లు మెగాస్టార్ తో ఫోటో దిగారు. ఇప్పుడు మెగాస్టర్ నా పేరు సూర్య సెట్స్ కి వెళ్లిన ఆ పిక్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయ్యింది.