Home రాజకీయాలు ఏపీ బంద్ స్వచ్ఛందం, సంపూర్ణం

ఏపీ బంద్ స్వచ్ఛందం, సంపూర్ణం

344
SHARE

టీడీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించినా.. నోటీసులిచ్చి బెదిరించినా.. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసినా కూడా ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా సోమవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ సంపూర్ణంగా విజయవంతమైంది. రాష్ట్ర సర్కార్‌ బెదిరింపులను సైతం ధిక్కరించి ఒక్కటైన జనం ప్రత్యేక హోదా కోసం దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, జనసేనతో పాటు ప్రజా, విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా హోదా కోసం కదంతొక్కాయి.

ప్రతి నియోజకవర్గం కేంద్రంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు, నేతలు బంద్ ను విజయవంతం చేసే బాధ్యతను తీసుకున్నారు. రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించారు. ఎక్కడా హింసాత్మక సంఘటనలు లేకుండానే ఈ బంద్ జరుగుతోంది. పలు చోట్ల మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు దురుసుగా వ్యవహరించిన దాఖలాలు కనిపించాయి. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ బంద్ లో యాక్టివ్ గా పాల్గొన్నాయి. జనసేన కూడా అక్కడక్కడ బంద్ లో కనిపించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ స్టేట్ బంద్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు బంద్ సందర్భంగా పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఈ బంద్ కు ప్రజల స్వచ్ఛంద మద్దతుతో తెలుగుదేశం నేతల్లో కూడా ఆందోళన రేగుతోంది.