Home రాజకీయాలు వైసీపీలోకి ఆనం, ఫోటో తొలగింపు, సీటు వద్ద చర్చలు||

వైసీపీలోకి ఆనం, ఫోటో తొలగింపు, సీటు వద్ద చర్చలు||

3673
SHARE

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం కుటుంబం టీడీపీని వీడడం ఖాయమైపోయింది. ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు కోరిన నియోజకర్గానికి ఇన్‌చార్జ్‌గా నియమిస్తామని హామీ ఇచ్చి ఆనం బ్రదర్స్‌ను టీడీపీలోకి తీసుకున్న చంద్రబాబు ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చారు.

ఆనం వివేకానందరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన ఆ కోరిక తీరకుండానే ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొంందుతున్నారు. టీడీపీ నాయకత్వం తీరుపై రగిలిపోతున్న ఆనం కుటుంబం.. నాలుగు రోజుల క్రితం చంద్రబాబు ఆనం వివేకనందరెడ్డిని పరామర్శించేందుకు వెళ్లగా.. ఆ సమయంలో ఆనం కుటుంబం ఉద్దేశపూర్వకంగా అక్కడ లేకుండాపోయింది.

ఫోన్ చేయగా.. మాట్లాడుకోవడానికి ఏమీ లేదని ఆనం రామనారాయణరెడ్డి ఫోన్ పెట్టేశారు. ఈనేపథ్యంలో నెల్లూరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఆనం కుటుంబం ఏసీసెంటర్‌లోని తన కార్యాలయంలో చంద్రబాబు ఫోటోను మాయం చేశారు. ఏసీ సెంటర్ ఆఫీసులో ”రేపటితరంకోసం చంద్రబాబు స్వప్నం ” పేరుతో అమరావతి రాజధాని చిత్రపటాన్నిఇది వరకు ఏర్పాటు చేశారు.

దానిపై చంద్రబాబు ఫోటో కూడా ఉండేది. కానీ టీడీపీతో గ్యాప్‌ పెరిగిన తర్వాత చంద్రబాబు బొమ్మ కనిపించకుండా సిబ్బంది చేత కాగితాలు అతికించారు. ఇప్పటికే వైసీపీతో చర్చలు కూడా ముగిసినట్టు చెబుతున్నారు.

టికెట్ విషయంలో మాత్రమే చర్చ జరుగుతోందంటున్నారు. ఆత్మకూరు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అంగీకరించినట్టు చెబుతున్నారు. ఆనం రామనారాయణరెడ్డి మాత్రం వెంకటగిరి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే టీడీపీ ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో సీటు విషయంలో ఏదోలా సర్దుబాటు చేసుకుని వైసీపీలో చేరాలని ఆనం కుటుంబం నిర్ణయించుకుంది.