Home రాజకీయాలు ఏపీకి హోదా కోసం.. వైఎస్సార్‌సీపీకి యుఎస్ఏ ఎన్ఆర్ఐల సంఘీభావం, నిరాహార దీక్ష

ఏపీకి హోదా కోసం.. వైఎస్సార్‌సీపీకి యుఎస్ఏ ఎన్ఆర్ఐల సంఘీభావం, నిరాహార దీక్ష

SHARE

ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు . క‌లిసిక‌ట్టుగా పోరాటం చేద్దాం.. ఏపీకి హోదా సాధించుకుందాం అంటూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్పార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి యుఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐలు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ యూఎస్ఏ ఎన్ఆర్ఐ విభాగం ఆద్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. అనేక మంది తెలుగువారు, పార్టీ అభిమానులు కొవ్వుత్తుల ప్రదర్శన చేశారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌ మధులిక మాట్లాడుతూ.. ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నిర్వర్తించడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేకహోదా ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, గత నాలుగేళ్లుగా ప్రతిపక్షనేత జగన్‌ మోహన్‌ రెడ్డి అనేక దీక్షలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారని పేర్కొన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి పోరాటానికి మద్దతుగా అమెరికా వ్యాప్తంగా హార్టుఫోర్డ్ సిటీ, ఫ్రీమౌంట్, డల్లాస్, ఓర్లాండో, అట్లాంటా, వాషింగ్టన్ DC తో పటు అనేక నగరాలలో ప్రదర్శనలు చేసినట్లు తెలిపారు. అమెరాకాలోని తెలుగువారి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

హార్టుఫోర్డ్ సిటీ

హార్డ్‌ఫోర్‌ సిటిలో వైఎస్సాఆర్‌ సీపీ యుఎస్‌ఏ కన్వీనర్‌ రత్నాకర్‌ ఆధ్వర్యంలో కొవ్వుత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి, సురేంద్ర అబ్బవరం, సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రవీణ్‌, సహదేవా, హరిమోయ్యి, త్రిలోక్‌, విజయ్‌, కొండారెడ్డి, శివ, అమర్‌, రాఘవ, వెంకట్‌, నరేంద్ర అట్టునూరి, సుబ్బారెడ్డి భాస్కర్‌, లోకేష్‌, శ్రీధర్‌, రవి కర్రి, వైఎస్సార్‌సీపీ విధ్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు

ఓర్లాండో

ఓర్లాండో సిటి, ఫోరిడాలో వైఎస్సాఆర్‌ సీపీ యుఎస్‌ఏ కన్వీనర్‌ డా. వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వుత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.

 

అట్లాంటా

వైసిపి ప్రత్యేక హోదా పోరుకి మేము సైతం అంటూ అట్లాంటాలోని వైసిపి ఎన్ ఆర్ ఐ మద్దతుదారులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఇంత మంది ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నా కేంద్రం నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు. వెంటనే ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసిపి కోర్ కమిటీ సభ్యులు చింతం వెంకట్, సభ్యులు జయచంద్రారెడ్డి, గురు పరందామి, మొండెద్దు వెంకట్ తో పాటు వైసిపి మద్దతుదారులు డాక్టర్ గడ్డం ధనుంజయ్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి, కొట్లూరు శ్రినివస్స్, కందుల కిరణ్, సింగారెడ్డి రవి వైసిపి మద్దతుదారులు పాల్గొన్నారు.

వాషింగ్టన్, DC

వాషింగ్టన్ డీసీ వర్జీనియాలోని ఫ్రైయింగ్ పాన్ ఫార్మ్ పార్కులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఫ్లకార్డులతో మౌనంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌ఐలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలపై ధ్వజమెత్తారు. ఈ నిరసన దీక్షలో రమేష్ రెడ్డి వల్లూరు, శశాంక్ అరమడక, అమర్నాథ్ కటికరెడ్డి, మదన్ గల్లా, ఇంతియాజ్ పఠాన్, శ్రీనివాసరెడ్డి గొప్పన్నగిరి, కిషోర్ జొన్నలగడ్డ, అర్జున్ కామిశెట్టి, శివ వంకిరెడ్డి, వెంకటమణిదీప్ కొత్తా, చంద్రతేజా రెడ్డి, శ్రీధర్ నాగిరెడ్డి, నినాద్ అన్నవరం, సతీష్ నరాల, వెంకట రాజా రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెంకటరమణారెడ్డి లతోపాటుగా పలువురు తెలుగువాళ్లు పాల్గొన్నారు.

కాలిఫోర్నియా

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ ఆర్ ఐ అధ్వర్యంలో తమ మద్దతు తెలిపారు. సభ్యులు చేతిలో ప్లకార్డ్స్ పట్టుకొని ‘ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు’ అంటూ నినదించారు. ప్రత్యేక హోదాని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి తాడికొండ నియోజకవర్గ ఇంచార్జి కత్తెర సురేష్ బాబు, రామ కృష్ణా రెడ్డి, గంగిరెడ్డి సూర్య, బొంతు మల్లికార్జున్, నాటా నాయకులు గంగాసాని రాజేశ్వర్ రెడ్డి, రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డల్లాస్

అలాగే ప్రత్యేకహోదాకి మద్దతుగా డాలస్ లో వైస్సార్సీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు అరవింగ్లో ఉన్న గాంధీ ప్లాజా వద్ద ఈదీక్ష చేయటం జరిగింది. ఈ దీక్షలో అనేకమంది తెలుగువాళ్లు పాల్గొని మద్దతు తెలిపారు. దీక్ష విరమించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టారు. వాతారణం అనుకూలించకపోయినప్పటికీ తీవ్రమైన చలిగాలుల్ని  లెక్కచేయకుండా నిరసన దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విడదీసి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే ఇప్పుడు హోదాని అడ్డుకొని టీడీపీ, బీజేపీపార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరసన దీక్షలోపాల్గొన్న వారిలో… మణి అన్నపురెడ్డి, కృష్ణారెడ్డి కోడూరు, రామి రెడ్డి బూచిపూడి, రమణారెడ్డి పుట్లూరు, శివ రెడ్డి వెన్నం, శ్రీకాంత్ రెడ్డి జొన్నల, చందురెడ్డి చింతల ,ప్రసాదరెడ్డి చొప్పా, రవి అరిమండ, ఉమా మహేశ్వర్ రెడ్డి కుర్రి, భాస్కర్ రెడ్డి గండికోట, ఉమా మహేశ్వర్ పార్నపల్లి, అవినాష్ రెడ్డి వెల్లంపాటి, శ్రీనివాస్ రెడ్డి ఓబుల్రెడ్డి, చైతన్య రెడ్డి, సునీల్ దేవిరెడ్డి, జయసింహ రెడ్డి, మధు మల్లు, తిరుమల రెడ్డి కుంభుమ్, తేజ నందిపాటి, పాల్, కిరణ్ సాలగాల ,తిరుపతిరెడ్డి పేరం, మల్లికార్జున మురారి, హేమంత్, యశ్వన్త్, చైతన్య,జగదీష్, రవి కదిరి, శరత్ యర్రం, ఉదయ్, శ్రావణ్,  మహేష్ కురువ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకి బుద్ధి చెప్పి ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న జగన్మోహనరెడ్డి గారికి అండగా నిలబడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి NRI లు విజ్ఞప్తి చేసారు.