Home రాజకీయాలు బీజేపీ ముప్పేట దాడి.. కష్టమే!

బీజేపీ ముప్పేట దాడి.. కష్టమే!

SHARE

ఇంతకాలం బాబు ఏది మాట్లాడితే అదే నిజం, అందులోని వాస్తవాలు దాగిఉంటాయి అని నమ్మబలికే రోజులు పోయాయి! సాక్షిలాంటి మీడియా ఉండటం దానికి ఒక కారణం అయితే… తాజాగా ఏపీ వాసుల అదృష్టం మేరకు బీజేపీ కి బాబు బై బై చెప్పడం మరో కారణం! ఇంతకాలం బాబు రాష్ట్రంలో ఏమి చేశారు.. ఢిల్లీలో ఏమి మాట్లాడారు.. అమరావతి వచ్చి ప్రజలకు ఏమి చెప్పారు వంటి విషయాలపై వన్ సైడ్ వార్తల రోజులు పోయాయి. ఇందులో భాగంగా తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు బాబు గుట్టు విప్పారు.

ఏపీలో జరిగిఏ ప్రతి కష్టానికి నష్టానికి బీజేపీయే కారణం, మోడీనే కారణం అని వాయించేస్తున్న బాబుకు హరిబాబు రూపంలో ఊహించని కౌంటర్ పడింది. ఈ కథనం సాక్షిలోనో వైకాపా నేతల నుంచో వస్తే కొట్టిపారేసే తమ్ముళ్లు.. టీడీపీ నేతలు సాక్ష్యాలతో సహా మీడియా ముందు పెట్టేసరికి ఉక్కిరిబిక్కిరవుతున్నారట. ఒకవైపు ప్రత్యేక హోదాకోసం వైకాపా అలుపెరగని పోరాటం, మరోవైపు ఏపీ బందు, ఇంకోపక్క ప్రజలతో జగన్ మమేకమై బాబుపై చేస్తున్న విమర్శలు.. ఇవి చాలవన్నట్లు తాజాగా హరిబాబు కూడా సాక్ష్యాలతో రంగంలోకి దిగారు! బాబుని నిలబెట్టి కడిగేసినంత పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ మూడుసార్లు జరిగిన పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో లక్షలకోట్ల పెట్టుబడులపై అవగాహన ఒప్పందాలు జరిగాయి. పారిశ్రామిక వేత్తలెవరూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం ప్రస్థావించలేదు. హోదా ఉంటేనే పెట్టుబడులు పెడతామని అనలేదు. అని గతంలో బాబుతో కలిపి చేసిన పనులపై వివరణతో మొదలుపెట్టిన హరిబాబు… “హోదా వలన వచ్చేది కొంతే.. హోదా సంజీవని కాదు.. ఇప్పటివరకూ ఇచ్చిన వాటికి ధన్యవాదాలు.. ప్రత్యేక హోదా వేరు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వేరు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చారు.. అని గతంలో బాబు చేసిన ప్రసంగాలను ప్రస్థావించారు.

ఈ లెక్కన చూసుకుంటే… హోదా రాకపోవడానికి అటు ప్రతిపక్ష వైకాపా, ఇటు గత మిత్రపక్ష బీజేపీ మరోపక్క ప్రజసంఘాలు.. ఇలా అన్ని వైపుల నుంచీ హోదా రాకపోవడానికి బాబే కారణం అనే క్లారిటీకి వచ్చేస్తూ, అందుకు సరిపడా సాక్ష్యాలు ప్రజల ముందు ఉంచుతున్నారు. ఈ దాడినుంచి తప్పుకోవడం బాబుకు అసాధ్యం అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.