Home రాజకీయాలు గతం మరిచిన వర్ల… ఏమిమాట్లాడుతున్నారు!

గతం మరిచిన వర్ల… ఏమిమాట్లాడుతున్నారు!

SHARE

వర్ల రామయ్య టీడీపీలో సీనియర్ నేత. టీవీ చర్చా కార్యక్రమాల్లో బాబును అత్యంత అడ్డంగా సమర్ధించగల నేర్పరి. అయితే గత రాజ్యసభ సీట్ల విషయంలో బాబు హ్యాండ్ ఇచ్చేసరికి కాస్త సైలంట్ అయిన వర్ల.. అనంతరం బాబు కాస్త చల్లబరిచే పనికి పూనుకుని ఒక పదవి కట్టబెట్టేసరికి మైళ్లీ మైకుల ముందుకు వచ్చి… చంద్రబాబును మొనగాడు అని ఆకాశానికెత్తేస్తున్నారు! ఈ సమయంలో దళితుల టాపిక్ ఎత్తుకున్న వర్ల రామయ్య… గతంలో బాబు దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మరిచారేమో అనే భావన కలగడం ఖాయం!

బాబు ఒక పదవి ఇచ్చే సరికి గతం మరిచినట్లుగా మాట్లాడుతున్న వర్ల.. తాజాగా దళితులు అంతా చంద్రబాబు వెంటే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఈ స్టేట్ మెంట్ ఇవ్వడానికి చాలా బరితెగింపు ఉండాలి లేక నిస్సుగ్గుగా అయినా చెప్పి ఉండాలి! దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని నిస్సిగ్గు వ్యాక్యలు చేసిన చంద్రబాబు మాటలకు ఖండించడానికి ముందుకురాని టీడీపీ దళితనేతలు.. ఈరోజు పదవులు వచ్చేసరికి మైకుల ముందుకువచ్చి… చంద్రబాబు దళితులను ఉద్దరించడానికి పుట్టాడన్న రేంజ్ లో చెప్పడం హాస్యాసపదం కాక మరేమిటి?

ముందుగా… దళితులపై మోదీ, అమిత్ షా దాడులు చేయిస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. అంతవరకూ బాగానే ఉంది. తాను నమ్మిన తనను నమ్మిన, తనకు కనీస బాధ్యత ఉన్న సామాజిక వర్గం గురించి వర్ల స్పందించడంవరకూ న్యాయమే. అంతవరకూ బాగానే ఉంది కానీ… దళితులపై అనుచిత వ్యాక్యలు చేసిన చంద్రబాబు మాత్రం దళితులను ఉద్దరించడానికే పుట్టాడనే కలరింగ్ మాటలు వెగటు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు. ప్రత్యేక హోదాతో పాటు దళితులపై దాడులను నిరసిస్తూ ఉద్యమించాలని వర్ల అనడం సబబే.. కానీ దళితులందరూ చంద్రబాబు వెనకే ఉన్నారని, ఉంటారని చెప్పడం ఆత్మవంచన కాక మరేమిటి?

వాస్తవంగా చెప్పాలంటే…మోడీ – బాబు.. ఇద్దరూ దళిత వ్యతిరేకులనే వాదన రోజు రోజుకీ బలపడిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. మోడీ దళితులపై భౌతిక దాడులు చేస్తుంటే.. బాబు వారిపై మానసిక దాడులు చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఈ విషయంలో దళితుల విషయంలో మోడీ ఖండించిన వర్ల… అదే దళితులపై బాబు వ్యాక్యలను కూడా ఖండించి ఉంటే.. ఖచ్చితంగా వర్ల అభినందనీయుడే. కానీ… ఇలా గతం మరిచి మాట్లాడంపై మాత్రం సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి!!