Home రాజకీయాలు బాబుకు భారీ థ్యాంక్స్ చెబుతున్న తమ్ముళ్లు!!

బాబుకు భారీ థ్యాంక్స్ చెబుతున్న తమ్ముళ్లు!!

SHARE

ఈ కథనం చదివేటప్పుడు, చదివిన అనంతరం కాస్త వెటకారంగా అనిపించినా కూడా ఇది సీరియస్ గా సీరియస్ విషయమే! నరాల్లో పసుపు రక్తం నింపుకున్న వీరాభిమానుల వేదన అనంతరం బాబు తీసుకున్న నిర్ణయంపై వారు వ్యక్తంచేస్తున్న హర్షం తాలూకు ప్రతిరూపం ఈ కథనం! చదువుతున్నపుడు వ్యంగ్యంగా అనిపించినా, తమ్ముళ్ల వేదన మాత్రం వాస్తవం. ఇంతకూ విషయం ఏమిటంటే… లోకేష్ కు సమ్మర్ క్లాసులు కండక్ట్ చేయాలని, ఈ క్లాసులు పూర్తయ్యేలోపు చినబాబు తెలుగులో అక్షరదోషాలు లేకుండా, పద దోషాలు లేకుండా, వాక్యదోషాలు అస్సలే లేకుండా షార్ప్ స్టూడేంట్ లా బయటకు రావాలనేది బాబు తాజా కోరిక!

అవును… అందరికీ వేసవి సెలవులు వస్తుంటే, లోకేష్ కు మాత్రం తెలుగు పంతులుతో సమ్మర్ క్లాసులు ఏర్పాటుచేయబోతున్నారు చంద్రబాబు. ఈ వయసులో ఇదేమిటి అని ఆశ్చర్యపోకండి… అంతా వచ్చు అని “పప్పు”లో కాలేసేకన్నా, రాదని ఒప్పుకుని నేర్చుకోవడంలో తప్పేముంది. నేర్చుకోవడానికి వయసుతో సంబందం ఏముంది? నెలకు సుమారు లక్షన్నర రూపాయల ప్రజాధనాన్ని లోకేష్ బాబుకు తెలుగు నేర్పేందుకు బాబు వెచ్చించనిర్ణయించారు. ఈ విషయంపై ప్రజలు ప్రతిపక్షాలు గొడవలు చేస్తాయనో ఏమో కానీ… ఆ తెలుగు మాస్టారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక మండలి సభ్యుడి హోదాను కట్టబెట్టి, ఆ పేరిట ట్యూషన్ ఫీజు చెల్లించనున్నారు చంద్రబాబు!

అయినా పర్లేదు.. ఏది జరిగినా, ఎవరు ఏమనుకున్నా పర్లేదు.. నెలకు లక్షన్నార కాదు మూడు లక్షలు ఖర్చైనా పర్లేదు.. కానీ, లోకేష్ కు మాత్రం చాలా సీరియస్ గా ట్యూషన్ చెప్పించాలని తమ్ముళ్లు సీరియస్ గా కోరుకుంటున్నారట. వారెందుకు అలా కోరుకుంటున్నారు అనే అమాయకు ప్రశ్నలు ఇక వద్దు. ఎందుకంటే… ఇంతకాలం తనదైన తెలివితో, తనకొచ్చిన తెలుగుతో టీడీపీ కార్యకర్తలను, నేతలను లోకెష్ బాబు పెట్టిన ఇబ్బంది మామూల్ది కాదు. “ఆయనదేముంది… ప్రసంగించేసి వెళ్లిపోతారు.. ఊర్లో జనాల దగ్గర, రాజకీయ ప్రత్యర్ధి కార్యకర్తల దగ్గర సమర్ధించుకోలేక చస్తుంది మేమేకదా..” అది తమ్ముళ్ల టెన్షన్!

“దేశంలో అత్యంత అవినీతిమయమైన పార్టీ ఏదైనా ఉందంటే… అది టీడీపీ! మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది తెలుగు దేశం పార్టీయే.. అవునా కాదా?” అని చెప్పడం లోకేష్ వాక్య దోషానికి ఉదాహరణ.. “రాష్ట్ర ప్రజలకు అంబేధ్కర్ వర్ధంతి శుభాకాంక్షలు” అని చెప్పడం లోకేష్ పదదోషానికి, పరిపూర్ణ అజ్ఞానానికి ఉదాహరణ! ఈ రేంజ్ లో తెలుగు పాండిత్యం కలిగిన లోకేష్ కు తెలుగు సరిగా నేర్పకుండా, మాట్లాడటం నేర్పకుండా జనాల్లోకి, అదికూడా సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వదిలితే.. జరిగే దారుణాలు, జారే ఆణిముత్యాలు, వదిలే వాగ్భాణాలు, కలిగే నష్టాలు మామూలుగా ఉండవనేది తెలుగుదేశం కార్యకర్తల టెన్షన్. పైగా ఇది ఎన్నికల సంవత్సరం.. ఈ సమయంలో లోకేష్ ను ఇదే “తెలుగు” తేటలతో జనాల్లోకి వదిలితే.. వైకాపాకు జగన్ అండ్ కో ఊహిస్తున్న మెజారిటీ కంటే భారీ మెజారిటీ రావడంలో లోకేష్ పాత్ర కీలకంగా మారే ప్రమాధం ఉంది! ఇది తమ్ముళ్ల భారీ టెన్షన్!!

ఇంతకాలం ఈ బాదను పైకిచెప్పలేక, లోపల దాచుకోలేక ఎంతో మదనపడిన టీడీపీ కార్యకర్తలు… “లోకేష్ కు తెలుగు నేర్పడం” అని బాబు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారట!!