Home రాజకీయాలు ప్రభుత్వ ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఇదేనా?

ప్రభుత్వ ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఇదేనా?

SHARE

ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ప్రజానాడి విషయంలో ఇంటిలిజెన్స్ ఇచ్చే సమాచారం చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు గుండెలు పిండేసే సమాచారం ఇచ్చిందంట ఇంటిలిజెన్స్ విభాగం! ఇదే క్రమంలో అనధికారికంగా టీడీపీ కార్యకర్తల నుంచి కూడా ఇలాంటి సమాచారమే వస్తుండటంతో బాబు తలపట్టుకుని కూర్చున్నారని తెలుస్తోంది.

వివరాళ్లోకి వెళ్తే… ప్రత్యేక హోదా అనే అంశం గత కొన్ని రోజుల్లోనే ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిందనే చెప్పాలి. ఈ క్రమంలో వైకాపా అధినేత జగన్ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంటే.. మరోపక్క తన ఎంపీలు ఢిల్లీలో ఆమరణనిరాహార దీక్ష చేస్తే.. గ్రామ గ్రామాన్న వైకాపా శ్రేణులు అధినేత ఇచ్చిన ఉత్సాహంతో హోదా పోరాటాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు మాత్రం స్పందించలేని పరిస్థితికి నెట్టివేయపడ్డారని తెలుస్తుంది. దీనికి కారణం రాబోయే ఎన్నికల్లో కీలక భూమిక పోషించబోతున్న ప్రత్యేక హోదా పోరాటం విషయంలో, రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడే విషయంలో పూర్తిగా వెనుకబడ్డామనే భావనలో వారంగా మునిగిపోయారని తెలుస్తుంది. వైకాపా ఎంపీలు ఢిల్లీలో ఫుల్ మార్కులు పొందితే… టీడీపీ ఎంపీలు మాత్రం మరింతకాలం నటించమని చెప్పిన బాబు మాట కూడా వినకుండా పీచేముడ్ అని అమరావతికి రావడంపై టీడీపీ కార్యకర్తలు కారాలూ మిరియాలూ నూరుతున్నారంట.

గడిచిన నాలుగేళ్లూ జరిగిందేదో జరిగింది.. కనీసం పోరాడాల్సిన సమయంలో అయినా నిజాయితీగా పోరాడి ఉంటే బాగుండేది.. ఇప్పటికీ డ్రామలే ఆడుతుంటే ఊర్లలో కార్యకర్తల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా ఉందట! ఫోటోలకు ఫోజులు, మీడియాకు లీకులు మినహా హోదా విషయంలో టీడీపీ నెతలు పోరాడిందేమీ లేదని టీడీపీ నేతలు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్న తరుణంలో ఇక కార్యకర్తల పరిస్థితి చెప్పుకోలేని రీతిలో ఉందట.

ఇవి చాలవన్నట్లు… పార్టీలో కొనసాగుతున్న అంతర్గత పోరు, నానాటికీ దిగజారుతున్న పార్టీ ప్రతిష్ట, పార్టీకోసం కష్టపడినవారికంటే ఎక్కువగా ఫిరాయింపుదారులకే పదవులు కట్టబెట్టడం వంటి విషయాలు కార్యకర్తల్లో తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయంట. గతంలో గోపీలకు నాలుగు మంత్రిపదవులు కట్టబెట్టిన బాబు, తాజాగా ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లో కూడా ఫిరాయింపుదారులకే పెద్ద పీట వేశారని తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. ప్రస్తుతం తేరుకునే పరిస్థితుల్లో పార్టీలేదని, బాబు అనుభవం పార్టీకి మరీ ఇలాంటి పరిస్తితి తెస్తుందని ఊహించలేకపోయామని వారంతా గొళ్లుమంటున్నారట.

ఇలాంటి సమాచారం బాబుకు ప్రభుత్వ ఇంటిలిజెన్స్ నుంచి వచ్చిందని.. దీంతో బాబు అండ్ కో టెన్షన్ లో పడి ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్నారని అంటున్నారు! జరిగిందేదో జరిగిపోయింది, మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు పూర్తిగా కనుమరుగైపోతున్న ఈ తరుణంలో… ఉన్నంతలో దోచుకోవాలనే కార్యక్రమానికి తెరలేపి, భూసంతర్పణలపేరున కథం తొక్కుతున్నారని సమాచారం!!