Home రాజకీయాలు హెరిటేజ్‌ భారీ కుంభకోణం

హెరిటేజ్‌ భారీ కుంభకోణం

SHARE

ఏపీ రాజధాని కుంభకోణాలమయమైంది. రాజధాని ప్రాంతాన్ని ప్రకటించకముందే టీడీపీ పెద్దలు గద్దల్లా వాలి రాజధాని చుట్టూ భూములను రైతుల నుంచి చౌకధరకు కొట్టేశారు. ఆ తర్వాతే రాజధానిని ప్రకటించుకున్నారు.

ఇప్పుడు ఇలాంటి కుంభకోణమే మరొకటి వెలుగు చూసింది. స్వయంగా చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థే ఈ భూదందాకు దిగిన వైనం వెలుగులోకి వచ్చింది. రాజధానిని ప్రకటించకముందే 14 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది హేరిటేజ్‌ సంస్థ.

చంద్రబాబు 2014 జూన్‌8న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయగా… సరిగ్గా నెలకు జులై 7న తాడికొండ మండలం కంతేరు వద్ద మువ్వా శ్రీలక్ష్మీ నుంచి హేరిటేజ్‌ సంస్థ తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసింది. అప్పటికి ఇంకా ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించలేదు. రాజధాని వస్తుందన్న విషయం తెలియక వారు తక్కువ ధరకే హేరిటేజ్‌కు భూములు అమ్మేశారు.

ఇలా భూములు కొన్న తర్వాత చంద్రబాబు ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. అయితే రాజధానికి పూలింగ్‌లో రైతుల భూములను తీసుకున్న చంద్రబాబు.. తన హెరిటేజ్ భూములు మాత్రం పూలింగ్‌లోకి రాకుండా జాగ్రత్తపడ్డారు.

అంతటితో ఆగలేదు. తమ భూమి విలువ మరింత పెరిగేందుకు గాను.. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును సరిగ్గా ఈ 14 ఎకరాల భూమిని ఆనుకుని వెళ్లేలా డిజైన్‌ తయారు చేయించారు. ఈ కుంభకోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.