Home రాజకీయాలు నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు!

నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు!

SHARE

దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు! వీళ్లిద్దరి హోదాలు వేరు, పార్టీలు వేరూ.. కానీ ఏపీ విషయంలో వీరిద్దరి డ్రామాలు మాత్రం దాదాపుగా ఒకటే! ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా జరిగిన అన్యాయంలో ఇద్దరిదీ కీలక భూమిక అయినప్పటికీ… నేరం నాది కాదంటే నాది కాదని వీరిద్దరు డ్రామాలాడుతున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దానికి మరో సాక్ష్యంగా నిలుస్తుంది బాబు తాజా నిర్ణయం… ఒకపూట నిరహారదీక్ష! ఈమాట విన్న అనంతరం… దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు… మొగుడిని కొట్టి మొగసాలకెక్కిన్నట్లుగా ఉందని అనడంలో ఎవరికీ ఎటువంటి సందేహం అవసరం లేదనే చెప్పాలి!

విషయానికొస్తే… తాజాగా జరిగిన పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా ఎందుకు వాయిదాపడ్డాయి అనే విషయం రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా ఇట్టే తెలిసిన విషయం! మోడీ కనుసన్నల్లో నడిచే అన్నాడీఎంకే ని అడ్డుపెట్టుకుని, పరిష్కారం ఉన్న కావేరీ బోర్డు ఇష్యూని పరిష్కరించకుండా సమస్యగా చూపించి.. పార్లమెంటులో డ్రామాలు ఆడింది, ఆడించింది ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే. వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణం చర్చకు రాకుండా, ఏపీ ప్రత్యేక హోదా అంశం పార్లమెంటులో నిలవకుండా మోడీ అండ్ కో ఆడినవి అత్యంత బహిరంగ డ్రామాలు.

ఇవన్నీ జనాలు గ్రహించరని అనుకున్నారో లేక జనాలకు అంత ఆలోచన లేదని నమ్మారో.. అదీ గాక నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న ఆలోచనో కానీ… పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకపోవడానికి ప్రతిపక్షాలే కారణం అని ఆరోపిస్తూ, అందుకు తనకు తెగ మనస్థాపం కలిగిందని నిరసిస్తూ.. ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు మోడీ! ఆయన డ్రామాలు అలా ఉంటే… తాజాగా బాబు కూడా అదే డ్రామాకు తెరలేపారు!

అసలు ఏపీకి ప్రత్యేక హోదా రాకపొవడానికి అన్నిరకాలుగానూ ప్రధాన కారణం చంద్రబాబు అనే విషయం చంద్రబాబుతో సహా అందరికీ తెలిసిందే! హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న ఆ నోరే.. ఈరోజు హోదా కావాలని అడుగుతుంది! వైకాపా అలుపెరగని పోరాటాల పుణ్యమా అని ఇప్పటివరకూ బ్రతికున్న హోదా పోరాటంలో జనాలు ఆగ్రహానికి బలైపోతామేమో అన్న భయంతో.. తానుకూడా హోదా హోదా అని బాబు పలికారే తప్ప అలా కానిపక్షంలో బాబు తనపని తానుచేసుకుంటూ వెళ్లిపోయేవారు. అలాంటి బాబు… హోదా రాలేదని ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించేశారు. అచ్చు మోడీ ఆడిన డ్రామాలాగానే.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా బాబు వ్యవహారం ఉందని కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో… బాబు మాత్రం సరికొత్త డ్రామాలకు తెరలేపుతూ, టార్గెట్ హోదా కాదు.. రాబోయే ఎన్నికలు అన్న చందంగా ముందుకుపోతున్నారు.

వైకాపా నాయకులు ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహారదీక్షకు దిగితే.. అవి డ్రామాలు అన్నారు.. మరి బాబు ఒకపూట చేసేది ఏమిటి? – నవ్విపోదురుగాక!!

పోరాటాలు ఢిల్లీలో చేయాలి.. రాష్ట్రంలో చేస్తే ఏమిలాభం… మరి బాబు చేసేది ఏమిటి? – నవ్విపోదురుగాక!!

బందులు, ధర్నలు, దీక్షల వల్ల రాష్ట్రాభివృద్ధికి ఆటంకం… మరి బాబు ఈనెల 20న చేసేది ఏమిటి? – నవ్విపోదురుగాక!!

హోదా ఇవ్వాల్సింది కేంద్రం.. కాబట్టి ఢిల్లీ వీదుల్లో ధర్నాలు చేయాలి… మరి ప్రతి జిల్లాల్లోనూ టీడీపీ సైకిల్ యాత్రలు ఎందుకు? – నవ్విపోదురుగాక!!

ఢిల్లీలో వైకాపా ఎంపీలు రాజినామాలు చేస్తే ఒరిగేది ఏమిటి… మరి బాబు ఒకపూట పస్తుంటే జరిగేది ఏమిటి? – నవ్విపోదురుగాక!!

వైకాపా నేతలు ఆమరణనిరాహార దీక్షకు దిగి ఆస్పత్రి పాలైతే.. వికెట్లు పడ్డాయంటారు.. మరి బాబు ఒక్కపూటకే పడిపోతే.. రిటైర్ హార్ట్ అనాలా లేక హిట్ వికెట్ అనాలా? – నవ్విపోదురుగాక!!