Home రాజకీయాలు హతవిధీ… బాబుకే వెన్నుపోటా?

హతవిధీ… బాబుకే వెన్నుపోటా?

651
SHARE

వెన్నుపోటు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అనే విమర్శ మూటగట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక సమస్య వచ్చిపడిందట. అదేదో తనకు తెలియని విద్యలోనో, ఆయనకు ప్రమేయంలేని రంగంలోనో అయితే.. అయ్యో పాపం చంద్రబాబుకు ఎంత కష్టం వచ్చింది అనొచ్చు కానీ.. బాబు సుమారుగా పి.హెచ్.డి. చేశారు అని చెప్పుకునే రంగంలో రావడంతో అంతా… హతవిధీ అని స్పందిస్తున్నారట. ఇంతకూ బాబుకు వచ్చిన సమస్య ఏమిటంటే… టీడీపీలో వెన్నుపోటు పొడుస్తున్నవారు ఎక్కువైపోయారంట! ఆంజనేయస్వామి ముందు గుప్పిగంతులు వెయ్యాలనే ఆ సాహసం ఎవరు చేశారనేదానిపై బాబు ఇప్పుడు తెగ ఆలోచిస్తున్నారట!

ఇంతకూ విషయం ఏమిటంటే.. టీడీపీలో ఇంటిదొంగలు ఎక్కువైపోతునారని బాబు తెగ ఫీలయిపోతున్నారట. పార్టీలోనే ఉంటూ ప్రభుత్వంలో పనిచేస్తూ.. అత్యంత రహస్యాలను ప్రత్యర్ధులకు చేరవేస్తున్నారట. అసలు ఏ విషయం చేరవేశారు.. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలిగిన నష్టం ఏమిటి.. అనే కదా మీ ప్రశ్న? అది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు నష్టం చేకూరే పని కాదు సుమా… తెలుగుదేశం కాంట్రాక్టర్లకు నష్టం కలిగించే పని!

అవును… ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాజెక్టులకు టెండర్లు పిలిచే సమయంలోనే ఆ టెండర్ల సమాచారం అంతా బయటకు పొక్కిందట. అది కాస్తా ప్రత్యర్ధి శిబిరానికి చేరిందని పలువురు మంత్రులు చెబుతున్నారు! దానితో ఆ కాంట్రాక్టులు వైకాపా నేతలకు దక్కుతున్నాయంట. మరికొన్ని శాఖల్లోని కీలక సమాచారం కూడా గుట్టుచప్పుడు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చేరిపోతోందట! అది చంద్రబాబు అండ్ కో ల బాద! సమాచారం బయటకు పొక్కడం వల్ల రాష్ట్రానికో ప్రజలకో ఏదో నష్టం జరిగిపోతుందని కాదు… వారికి మాత్రమే రావాలని పథకాలు రచించుకున్న కాంట్రాక్టులు ప్రత్యర్ధుల చేతుల్లోకి పోతున్నాయని.

అంటే… టీడీపీ అధికారంలో ఉంటే అన్ని కాంట్రాక్టుల అన్నీ టీడీపీ నేతలే చేసుకోవాలన్నమాట. ఈ లెక్కన ఇంక టెండర్ల సిస్టం ఎందుకో తమ్ముళ్లే చెప్పాలి. వైకాపా నేతలు కాంట్రాక్టులు దక్కించుకున్నంత మాత్రాన్న ఎవరో ఇంటిదొంగలు, వెన్నుపోటు దారులు అని బాబు గంతులేయడం హాస్యాస్పదమే! మరో విషయం ఏంటంటే… పట్టిసీమ అవకతవకలపై బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌ రాజుకు సమాచారం అందించిన పని కూడా “బాబు వారసులే” చేశారని అంటున్నారు!!