Home రాజకీయాలు రాజ్యాంగంపై బాబు డైలాగ్‌ మాములుగా లేదుగా!

రాజ్యాంగంపై బాబు డైలాగ్‌ మాములుగా లేదుగా!

533
SHARE

మర్డర్ చేసి తిరిగి పూలమాలవేసి నివాళులర్పించడంతో చంద్రబాబును మించిన వారే లేరని వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు. తాజాగా అంబేద్కర్ జయంతి సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అదే తరహాలో ఉన్నాయి.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతూ.. రాజ్యాంగం మంచిదే అయినా దాన్ని అమలు చేసే వారు చెడ్డవారైతే రాజ్యాంగం కూడా చెడ్డదవుతుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యే ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజ్యాంగాన్ని చెడ్డగా వాడింది ఎవరు?. ఒక పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను మరో పార్టీలో చేరవద్దని, చేర్చుకోవద్దని రాజ్యాంగం చెబుతోంది. మరి ఏపీలో మాత్రం అదే రాజ్యాంగంపై అత్యాచారం చేసి 22 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను ఫిరాయింప చేసింది ఎవరు?.

ఇప్పుడు అంబేద్కర్‌కు నివాళులర్పించి రాజ్యాంగంపై లెక్చర్‌ దంచుతున్న ఇదే చంద్రబాబు కదా!. రాజ్యాంగం మంచిదే అయినా అంబేద్కర్ చెప్పినట్టు చంద్రబాబు చేతిలో పడే అది చెడ్డదైపోయిందన్నది నిజం కాదా!.