Home రాజకీయాలు బాబుని ఇరికించిన ఈనాడు!

బాబుని ఇరికించిన ఈనాడు!

1113
SHARE

వైకాపా నేతలు ఎప్పటినుంచో చెబుతున్న మాట, మొత్తుకుంటున్న విషయం.. ఏపీ ప్రభుత్వంలో నిధులు దారిమల్లుతున్నాయని! వైకాపా నెతలు చెబితే.. వాటిలో పూర్తి వాస్తవాలున్నప్పటికీ వాటిని రాజకీయ విమర్శలుగా కొట్టిపారేశారు టీడీపీ నేతలు. ప్రభుత్వంపై కావాలనే బురదజల్లుతున్నారని తప్పించుకుని తిరిగారు. అయితే ఇదే విషయాలపై కాగ్ కడిగిపారేసింది. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది మే నెల వరకూ వివిద కార్యక్రమాల కింద ఇచ్చిన అడ్వాన్సుల సొమ్ము మొత్తం రూ. 146.34కోట్లకు సంబందించి వినియోగపత్రాలు ఇప్పటివరకూ అందలేదని కాగ్ తన ఆడిటింగ్ లో గుర్తించింది. సరిగ్గా ఈ అంశంపైనే ఈనాడు కథనం ప్రచురించింది.. దీంతో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయినట్లయ్యింది.

అయితే ఈ కథనంలో ఈనాడు తన మార్కు తెలివితేటలు చూపించే క్రమంలో… ఈ నేరం మొత్తం అధికారులది అనే చందంగా రాసుకొచ్చినప్పటికీ, అది పూర్తిగా బాబు ప్రభుత్వంపై పడుతుందని ప్రజలు గ్రహించారు!! సర్వశిక్షాభియాన్ లో వినియోగించాల్సిన నిధులు ఏ రకంగా దారిమల్లించబడ్డాయి అనే విషయంపై కాగ్ ఇచ్చిన నివేధికను చూపించి ఈనాడు ఈ కథనం ప్రచురించింది. జిల్లాస్థాయిలో సర్వశిక్షాభియాన్ వద్ద నిధులు ఉండటంతో… వీటిని ఇతరశాఖలకు అడ్వాన్సులు ఇవ్వడానికి ఖర్చుచేయడం, ఆ ఇతరశాఖలకు పిల్లల విద్యకు ఏమాత్రం సంబందం లేకపోవడంతో కాగ్ ఖంగుతిన్నంతపనైందట.

ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు వైకాపా నేతలు ఎన్నోసార్లు మొత్తుకున్నా, పిల్లలకోసం వారి విద్యాభివృద్ధికోసం కేటాయించిన సొమ్ము దారిమల్లుతుందని ఎంతచెప్పినా పట్టించుకోని ప్రభుత్వం ఈ విషయంపై ఇప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం.. ఈ కథనం బీజేపీకి బూస్ట్ ఇవ్వడం! కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు సక్రమంగా ఖర్చుచేయడం లేదని, నిధులు దారిమల్లుతున్నాయని బీజేపీ నేతలు చేస్తున్న వాదనకు, ఆరోపణలకు ఈ నివేధిక, ఈనాడు కథనం ఫుల్ ఎనర్జీ ఇచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ చేస్తున్న వాదనకు ఇది మరింత బలాన్ని చేకూర్చిందని అంటున్నారు!!

ఇప్పటికే నిధుల మల్లింపు విషయంలో ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్న తరుణంలో… కాగ్ నివేధిక, ఈనాడు కథనం కలిపి బాబు అండ్ కో ను ఇరుకున పాడేశాయనే చెప్పుకోవాలి. ఇదే కథనం సాక్షిలో ఉన్నదిఉన్నట్లుగా వచ్చినా కూడా తప్పుపట్టి సైడైపోయే టీడీపీ నేతలు.. ఈనాడులో వచ్చేసరికి సైలంటుగానే ఫీలవుతున్నారట. ఏది ఏమైనా.. కాగ్ రిపోర్ట్, ఈనాడు కథనాలతో డిఫెన్స్ లో పడిన బాబు… ఆత్మరక్షణలో భాగంగా మౌనాన్నే తమ బాషగా చేసుకున్నారని, తేలు కుట్టిన పెద్దమనిషిలా మిన్నకున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి!!