Home రాజకీయాలు బీజేపీకి బాబు పరోక్ష ప్రేమ సంకేతాలు!!

బీజేపీకి బాబు పరోక్ష ప్రేమ సంకేతాలు!!

279
SHARE

ఏమాటకామాట చెప్పుకోవాలంటే పైకి మోడీపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారే తప్ప, లోలోపల బీజేపీపై బెమ మాత్రం పోయినట్లులేదు. ఎందుకంటే… బాబుకు ఉన్న “వ్యక్తగత అవసరాల రీత్యా కచ్చితంగా కేంద్రంలో పెద్ద పార్టీతో మైత్రి ఎంతైనా అవసరం” (ఈ లైన్ గుర్తుపెట్టుకోవాలి). ఈ విషయంలో బాబు ఫస్ట్ ఆప్షన్ కచ్చితంగా బీజేపీ అనడంలో అతిశయోక్తి లేదు. హోదా విషయంలో వైకాపా మైలేజీ తెచ్చుకోవడం, జనాలు టీడీపీపై గుర్రుగా ఉండటంతో మరో ప్రత్యామ్నాయం లేక మోడీపై ఫైరవుతున్నారు తప్ప.. బీజేపీకి పూర్తిగా దూరం అవ్వలనే ఆలోచన బాబుకు ఉన్నట్లు లేదు!

ఈ క్రమంలో బీజేపీతో కటీఫ్ అని ప్రకటించిన అనంతరం హోదా కోసం 30వ సారి ఢిల్లీ పర్యటన అని బయలుదేరి వెళ్లిన బాబు.. సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ తో భేటీ అవ్వడం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. భవిష్యత్తులో టీడీపీ – కాంగ్రెస్ తో కలిసి పోటీచేయబోతుందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో బాబు కాస్త ఆసక్తి చూపించినా.. అహ్మద్ పటేల్ రూపంలో కాంగ్రెస్ నుంచి ఏమాత్రం సానుకూల సమాధానాలు రాలేదని చెబుతున్నారు! ఈ క్రమంలో తృతియ ఫ్రంట్ అన్నా, మరో ఫ్రంట్ అన్నా అది ప్రాక్టికల్ గా సాధ్యంకాదని నమ్మని బాబు… మరలా బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో బీజేపీకి బాబు కాంగ్రెస్ తో కలుస్తున్నారనే ఆలోచనలు, అనుమానాలు రాకుండా.. ఇంకా బీజేపీపై బెమ ఉందనే సంకేతాలు ఇచ్చేలా ప్రయత్నించినట్లు తాజా సంఘటనలు తెలియచేస్తున్నాయి.

ఈ క్రమంలో టీడీపీ ఎంపీతో ఒకమాట, మంత్రితో ఒక మాట చెప్పించి ఈ విషయంలో కాస్త క్లారిటీ ఇచ్చే పనికి పూనుకునట్లున్నారు చంద్రబాబు! తాజాగా ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ ఎంపీ మాగంటి బాబు.. బీజేపీతో టీడీపీ సంబందంపై స్పందించారు. ఇప్పటికీ చంద్రబాబు – మోడీ – పవన్ కల్యాణ్ ల ఫోటోలతో కొన్ని పెన్నులు, పుస్తకాలు, డైరీలు, పర్సులు ముద్రించి ఇప్పటికీ దాచినట్లున్నారు.. అవి ఇంకా ఎందుకు ఉంచారు.. అవి పనికిరావుకదా అని జర్నలిస్టు ప్రశ్నించగా.. దీనిపై స్పందించిన మాగంటి బాబు “ఏమో.. ఏదో ఒక ఆశ ఉంటుంది కదా.. ఈరోజు ఏదో గొడవపడినంత మాత్రాన్న” అని స్పందించారు. దీంతో… బాబు, పైకి బీజేపీతో కటీఫ్ అని చెబుతున్నా, తన ఎంపీలతో మాత్రం బీజేపీ విషయంలో మరీ తెగేవరకూ లాగొద్దనే సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తుంది.

అక్కడితో బీజేపీతో టీడీపీ పూర్తిగా దూరం అయిపోలేదన్న సంకేతాలు ఇప్పించిన చంద్రబాబు… మంత్రి కళా వెంకట్రావుతో.. కాంగ్రెస్ తో పొత్తు ఉండదనే సంకేతాలు ఇప్పించారు. తాజాగా కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు అనే అంశంపై స్పందించిన కళా వెంకట్రావు… “కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని.. ఆ పార్టీతో పొత్తు అనేది జరిగేపని కాదు” అని స్పష్టం చేశారు. దీంతో ఇటు జనాలకు, అటు కాంగ్రెస్ కు క్లారిటీ ఇవ్వడంతో పాటు బీజేపీకి కూడా తన పరోక్ష ప్రేమ లేఖ రాసినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు!! ప్రస్తుతం మోడీపైనా, బీజేపీపైనా బాబు చూపిస్తున్న ఆగ్రహం కేవలం ఏపీజనాల సానుభూతికోసమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!