Home సినిమా అఖిల్‌ సరసన  హీరోయిన్‌గా రష్మికా!

అఖిల్‌ సరసన  హీరోయిన్‌గా రష్మికా!

421
SHARE

‘ఛలో’తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు కన్నడ బ్యూటీ రష్మికా మండన్నా. ఛలో సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నారు ఆమె.. దాంతో వరుస ఆఫర్స్‌ కొట్టేస్తున్నారు రష్మిక. ప్రస్తుతం నాగార్జున – నాని మల్టీస్టార్‌లో, విజయ్‌ దేవరకొండతో ఒక సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారామె. ఇప్పుడు హలో తో ఊపు మీద వున్న అఖిల్‌, రష్మికాకు  హలో చెప్పబోతున్నారట.

అఖిల్‌ ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ సినిమాలో యాక్ట్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ లవ్‌స్టోరీలో అఖిల్‌ సరసన  హీరోయిన్‌గా రష్మికా మండన్నాను చిత్రబృందం ఎంపిక చేసిందని సమాచారం. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంగీతం: తమన్‌.