Home రాజకీయాలు చంద్రబాబు పరువు తీసిన కుటుంబరావు!

చంద్రబాబు పరువు తీసిన కుటుంబరావు!

3442
SHARE

ఈమధ్య కాలంలో టీడీపీ నాయకులకంటే కూడా ఎక్కువగా ప్రతిపక్ష వైకాపా పై విమర్శలు చేస్తున్నారనే కామెంట్స్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుపై పడుతున్నాయి! ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదని స్వయంగా కుటుంబరావే పలుమార్లు రుజువుచేసుకున్న దాఖళాలు కూడా చాలా మందికి తెలిసిన విషయమే. అయితే.. తమ చేతకానితనం బయటపడుతున్న ప్రతి సందర్భంలోనూ ఆ నేరాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టేయాలని టీడీపీ రాజకీయాన్ని బాగా ఒంటపట్టించుకున్నారో ఏమో కానీ.. కుటుంబరావు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనూ, తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానూ వైకాపాపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో తెలిసో తెలియకో, బాబు చేవలేని సీఎం అని చెప్పేస్తున్నారు!

విషయానికొస్తే…ఏపీలో సుమారు 18లక్షల మందిని బాదితులుగా చేసిన వ్యవహారం.. అగ్రిగోల్డ్ స్కాం! ఈ విషయంలో ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం బాదితులకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యింది! ఈ క్రమంలో అగ్రిగోల్డ్ ఆస్తులను టేకప్ చేయడానికి జీ-ఎస్సెల్ గ్రూప్ ముందుకొచ్చింది. ఇంతలో ఏమైందో ఏమిటో కానీ… ఉన్నపలంగా వెనక్కు వెళ్లిపోయింది. అయితే… దీనికి కారణం ప్రభుత్వ పెద్దల వ్యవహారమే అని, లోకేష్ అండ్ కో ల తాంబూలాల వ్యవహారం అని కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో.. దీనికి కారణం పూర్తిగా వైకాపానే అని ఆరోపిస్తున్నారు కుటుంబరావు!

నిన్నమొన్నటి వరకూ ముందుకొచ్చిన సంస్థ.. ఉన్నపలంగా వెనక్కి వెళ్లిపోతుంటే, దానికి కారణం ప్రతిపక్షం అని చెబుతుంటే.. తెలిసో తెలియకో బాబు అనుభవాన్ని, పరిపాలనా సామర్ధ్యాన్ని కుటుంబరావు అవహేళన చేస్తున్నట్లుందని బాబు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సమస్య పరిష్కరించడానికి వచ్చిన సంస్థకు పరిస్థితులను క్ల్రియర్ గా చెప్పి, ఒక వేళ ఎవరైనా ఆ సంస్థలకు తప్పుడు సమాచారం ఇస్తుంటే.. ఆ విషయాలను సదరు సంస్థ అధినేతలతో క్లియర్ గా మాట్లాడుకుని ఒప్పించుకోవాలి! అలా కాకుండా తమ వ్యక్తగత ప్రయోజనాలు అందకో మరో కారణంతోనో పరిష్కారాన్ని దూరం చేసుకున్న టీడీపీ నేతలు.. ఇలా వైకాపాపై నోరుపారేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. తమ చేతకాని తనాన్ని వైకాపా రుద్దడం నిస్సిగ్గు చర్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతకు, గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రాల్ తిప్పిన నేతకు… ఈ వ్యవహారంపై జి-సంస్థ పెద్దలతో కలిసి చర్చించి, వారికున్న అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసి, సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రిని పక్కనపెట్టిన కుటుంబరావు.. అల్రెడీ డీల్ పోయిందని, దానికి కారణం వైకాపా అని విమర్శిస్తున్న తరుణంలో… పరోక్షంగా చంద్రబాబు చేతకాని సీఎం అని పరోక్షంగా హింట్ ఇస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు!! ఫక్తూ రాజకీయ నాయకుల్లాగానే కుటుంబరావు కూడా… పరిష్కారాలు వదిలి, విమర్శలు చేయడంపై అధిక దృష్టిపెడుతున్నారనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి!!