Home రాజకీయాలు డప్పుమీద దెబ్బ… అయ్యన్న డ్యాన్స్ అబ్బ!

డప్పుమీద దెబ్బ… అయ్యన్న డ్యాన్స్ అబ్బ!

SHARE

రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అంటే హుందాగా వ్యవహరించాలి, ఆదర్శప్రాయంగా నడుచుకోవాలి అనేవి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న సంఘటనలు గుర్తుకురావడమే తప్ప, తాజా పరిస్థితుల్లో కళ్లతో చూసే భాఘ్యం చాల అరుదు! టీడీపీ అధికారంలోకి వచ్చిననాటిన్ ఉంచి అడపాదడపా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేస్తున్న కార్యక్రమాలు వారిని అబాసుపాలు చేస్తున్నాయనడంలో సందేహం లేదు. మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తించేది ఒకరైతే, రికార్డింగ్ డ్యాన్స్లు కండక్ట్ చేసేది మరొకరు, వారితో కలిపి డ్యాన్సులు చేసేది ఇంకొకరు. వీరెవరికీ తీసిపోనట్లు డ్యాన్సర్ల జాకెట్లకు డబ్బులు అందించారు!!

వివరాళ్లోకివెళ్తే… తాను ప్రజాప్రతినిధిని, రాష్ట్ర మంత్రిని అన్న విషయం మరిచారో లేక డబ్బు మీద దెబ్బ పడేటప్పటికి ఆగలేకపోయారు తెలియదు కానీ… రాష్ట్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చిందులేశారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో మహిళా డ్యాన్సర్లతో “వెయ్ రాజా” అంటూ చిందులేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. డప్పు దెబ్బకు అనుగుణంగా ఆయన చేసిన డ్యాన్స్‌ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది! మా మంత్రిగారు ఇంత కళకారుడా అని జనాలు తెగ కామెంట్స్ చేస్తున్నారు!

ఆ సంగతులు అలా ఉంటే… ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏమాత్రం పట్టని స్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించడం పై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. వైకాపా ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే ఇక్కడ చంద్రబాబు అండ్ కో అమరావతిలో ఆటల పోటీలు పెట్టుకుంటారు.. వైకాపా నేతలు, ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా నినాదాలు చేస్తుంటే.. బంద్ ల వల్ల ఇరిగేమీ లేదని ఏసీ రూంస్ లో ప్రెస్ మీట్ లు పెడతారు. తాజాగా ఈ మంత్రిగారేమో ప్రత్యేక హోదా విషయం, తన “హోదా” విషయం మరిచి ఇలాంటి పనులు చేస్తున్నారు!!