Home రాజకీయాలు మంత్రి జ‌వ‌హ‌ర్‌ వైసీపీకి వెళ్తున్నారా?

మంత్రి జ‌వ‌హ‌ర్‌ వైసీపీకి వెళ్తున్నారా?

SHARE

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడు కొత్త‌ప‌ల్లి శామ్యూల్ జ‌వ‌హ‌ర్! టీడీపీ తరుపున కాస్త గట్టిగానే మాట్లాడుతూ, చంద్రబాబును కాస్త బలంగానే వెనకేసుకొస్తూ.. ఉన్నంతలో తన కార్యక్రమాలు తాను చక్కబెట్టుకునే నేత! ఈ మధ్యకాలంలో ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఇసుక రీచ్‌ల్లో ఆయ‌న‌కు వాటాలు, నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న అనుచ‌రుల దందాలు పేట్రేగుతున్నాయన్న కథనాలు ముద్రిస్తున్నాయి టీడీపీ కరపత్రాలు! దీంతో… మంత్రి జవహర్ వైకాపాకు వెళ్తున్నారా అనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు నియోజకవర్గ జనాలు! ఆ సంగతి అలా ఉంటే… ఇక్కడ గమనించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.

నిన్నమొన్నటివరకూ టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తిపై టీడీపీ అనుకూల మీడియా ఎందుకు దుమ్మెత్తి పోస్తుంది? ఏకంగా.. టీడీపీని భ్రష్టు పట్టిస్తున్న జవహార్ అనే రేంజ్ లో ఎందుకు కథనాలు వడ్డిస్తుంది? జవహార్ కేవలం ఉపాధ్యాయ సంఘం నేత.. అతని పేరు ఎవరికీ తెలియదు.. అని ఇప్పుడు ఉన్నఫలంగా టీడీపీ ఎందుకు గుర్తుచేస్తుంది? జవహార్ సమర్ధుడు కానిపక్షంలో ఎందుకు సీటిచ్చినట్లు, నియోజకవర్గ ప్రజల జీవితాలు ఎందుకు ఆయన చేతిలో పెట్టినట్లు, ఎందుకు మంత్రిని చేసినట్లు? ఇవన్నీ వరుసగా వస్తున్న ప్రశ్నలు. పార్టీ పెద్దలకు అందాల్సిన వాటాలు అందించడం లేదనేమో అనే కామెంట్స్ వీటికి అనుగుణంగా రావడం ఇక్కడ కొసమెరుపు. ఇంతకూ ఇప్పుడు జవహార్ పై ఉన్నపలంగా టీడీపీ అనుకూల మీడియా అవినీతిపరుడిగా, పార్టీకి నష్టం కలిగించే వ్యక్తిగా ఎందుకు చిత్రీకరిస్తుంది అనేదానికి రెండు సమాధానాలు ఊహిస్తున్నారు విశ్లేషకులు!

వాటిలో ఒకటి… 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని మద్దతు టీడీపీకి ఇచ్చిన జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాల పాత్ర కీలకం. అయితే ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలు, బాబు పాలన చూసిన అనంతరం ఆ రెండు జిల్లాల ప్రజలు వైకాపా వైపు చూస్తున్నారనే విషయం సుస్పష్టం అని అవుతున్న వేల.. టీడీపీలో ఊహించని నాయకులు ఉభయ గోదావరి జిల్లాల్లో వైకాపా వైపు వెళ్తారని ఊహగాణాలు వినిపిస్తున్నాయి. ఈ లిస్టులో జవహార్ కూడా ఉండొచ్చని గాసిప్స్ వస్తున్న తరుణంలో… జవహార్ ను అవినీతిపరుడిగానో లేక అసమర్ధుడిగానో చిత్రీకరించి, బయటకు పంపే యోచనలో బాబు అండ్ కో ఉన్నారని తెలుస్తుంది.

ఇక రెండో విషయం… బాబుకు ఎవరైనా నచ్చకపోయినా, లోకేష్ కనుసన్నల్లో నడవకపోయినా… వారిపై బట్టకాల్చి మీద పాడేసే పరిస్థితి చాలా సందర్భాల్లో చూశాం అని పలువురు అభిప్రాయపడుతున్నా నేపథ్యంలో… జవహార్ పార్టీకి, పదవికి రాజినామా చేసి వెళ్లేలోపు, అతనిపై బురదజల్లేసి, తామే తొలగించామని చెప్పుకునే ఆలోచన కూడా చేస్తండొచ్చని మరికొందరి ఆలోచన! ఏది ఏమైనా… టీడీపీలో ఉన్న ఎంత అవినీతిపరులైన మంత్రులపైనా, ఎన్ని దుర్మార్గాలకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అయినా వ్యతిరేకంగా చిన్న కథనం కూడా ప్రచురించని పసుపు కరపత్రాలు.. జవహార్ పై ఈ రేంజ్ లో ఫైరవడం తాజాగా చర్చనీయాంశం అయ్యింది!!